AP Capital Issue: రాజకీయం ఎప్పుడు ఒకేలా ఉంటే అది ఎందుకు రాజకీయం అవుతుంది. అది చదరంగంతో సమానం. ఎత్తుకు పైఎత్తులు వేస్తే కానీ అక్కడ పైచేయి సాధించలేం. అయితే ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ కు ఉన్న తెలివితేటలు ఎవరికీ ఉండవు. తిమ్మిని బమ్మిని చేయగల నేర్పరి ఆయన. అధికారంలోకి రాక మునుపు.. అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన చేసిన ప్రకటనలు, చెప్పిన మాటలు కానీ పక్కపక్కన పెడితే ఆయన తీరు ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. అమరావతి విషయంలో కూడా ఆయన విపక్షంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత అదే అమరావతిని గొంతునొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం సాయం లేనిదే సాహసోపేత నిర్ణయాలకు రాలేరన్న అనుమానాలున్నాయి. ఢిల్లీ పెద్దల సహకారంతోనే అమరావతిపై కర్కశం ప్రదర్శించగలుగుతున్నారన్న టాక్ ఉండేది. అయితే దీనిని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఈ తప్పిదంలో భాగస్వామ్యం కాకూడదని తాజాగా నిర్ణయించుకోవడం సరికొత్త ట్విస్ట్.
Also Read: CM Jagan: ఏపీలో గెలుపు కోసం జగన్ వేసిన ప్లాన్ ఇదీ
అమరావతి రాజధాని విషయంలో కీలక పరిణామం ఒకటి చోటుచేసుకుంది. ఎన్నడూ ఇవ్వనంతగా కేంద్ర ప్రభుత్వం క్లారిటీగా చెప్పేసింది. నిన్న ఉదయం రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి లేవనెత్తిన సమస్యపై కేంద్రం సమాధానమిచ్చింది. చట్టం, రాజ్యాంగం ప్రకారమే అమరాతి రాజధాని ఏర్పాటైందని స్పష్టం చేసింది. అక్కడితో ఆగకుండా సుప్రిం కోర్టులో ఏకంగా అమరావతి రాజధాని అని అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టం ప్రకారమే అమరావతి రాజధానిగా ఏర్పాటైందని.. ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేసింది. దీంతో జగన్ సర్కారుకు షాక్ తగిలింది. ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతోంది. ఈ నెల 23న కోర్టులో విచారణ మరోసారి వాయిదా పడే చాన్స్ ఉందని భావిస్తోంది.
సుప్రీం కోర్టులో అమరావతి రాజధాని విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. విచారణ ఈ నెల 23కు వాయిదా పడింది. వీలైనంత త్వరగా కేసు విచారణ పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరుపున న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రిం కోర్టుకు లేఖ రాశారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం విచారణ వాయిదా వేసి తొలి షాకిచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే నేరుగా అమరావతి రాజధాని అంటూ అఫిడవిట్ దాఖలు చేయడంతో కేసు మరింత స్ట్రాంగ్ అయ్యింది. రైతులకు అనుకూలంగా తీర్పు వచ్చే చాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.
సుప్రీం కోర్టులో అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్న వైసీపీ సర్కారు రాజధానిని విశాఖ కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. వచ్చే నెలలో ఉగాది నాటికి విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీసు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. భవనాల అన్వేషణలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇలా ధైర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తెర వెనుక సాయం అందిస్తుండడమే కారణమన్న అనుమానాలున్నాయి. కానీ ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం అమరావతే రాజధాని అంటూ అఫిడవిట్ దాఖలు కావడంతో కేసు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా పరిస్థితులు కనిపించడం లేదు. కేంద్ర తాజా సంకేతాలతో జగన్ వెనక్కి తగ్గుతారా? లేక ముందడుగు వేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
అమరావతియే ఏపీ రాజధాని అని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎలా ముందుకెళుతుందన్నది ఆసక్తి రేపుతోంది. ఈ ఉగాదినుంచి విశాఖకు రాజధాని మార్చి అక్కడి నుంచే ఏపీని పరిపాలించాలని జగన్ పట్టుదలగా ఉన్నారు. మరోవైపు అమరావతినే ఏపీ రాజధాని అని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జగన్ ముందడుగు వేస్తారా? విశాఖను అధికారికంగా ఎలా రాజధానిగా మార్చుతాడన్నది ఆసక్తి రేపుతోంది.
Also Read:PM Modi- Pathan Movie: కశ్మీర్ రాత మార్చాడు.. ‘పఠాన్’ విజయాన్ని పరోక్షంగా ఒప్పుకున్న మోడీ