Jamili Elections : కేబినెట్‌ ఆమోదం.. శీతాకాల సమావేశాల్లో బిల్లు! జమిలి ఎన్నికల నివేదికలో ఏముంది? కమిటీ సిఫారసులు ఇవీ

కేంద్రంలో ఈసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ప్రధాని మోదీ దూకుడు తగ్గుతుందని రాజకీశ పండితులు భావించారు. కానీ, సోలోగా అయినా.. సంకీర్ణంలో అయినా తగ్గేదేలే అంటున్నారు భారత ప్రధాని. దేశ ప్రయోజనాల విషయంలో కాంప్రమైజ్‌ లేదన్న సంకేతాలు ఇస్తున్నారు. తాజాగా ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Written By: Raj Shekar, Updated On : September 18, 2024 6:36 pm

Union cabinet green signal for Jamili election

Follow us on

Jamili Elections : భారత దేశం ప్రజాస్వామ్య దేశం. అందుకే మన దేశంలో ఎన్నికలకు చాలా ప్రాధాన్యం ఉంది. ఓటర్లకు గుర్తింపు ఉంది. ఎన్నికలే లేకుంటే.. ప్రజలను పట్టించుకునే నాథుడే ఉండేవాడు కాదు. మన రాజ్యాంగం ప్రకారం ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం సయం ప్రతిపత్తి గల ఎన్నికల వ్యవస్థ పనిచేస్తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగేవి. కానీ, మధ్యలో ప్రభుత్వాలను రద్దు చేయడం, అవిశ్వాసంతో కూల్చడం వంటి కారణాలతో ఏటా ఎదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో భారత ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది. పార్లమెంటుకు, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం కారణంగా అభ్యర్థుల ఎన్నికల ఖర్చు కూడా పెరుగుతోంది.ఈ నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్‌ జమిలి ఎన్నికలను తెరపైకి తెచ్చింది. వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. తర్వాత దీని సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి కామ్‌నాథ్‌ కోవింద్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటి అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించింది. వారి అభిప్రాయం మేరకు నివేదిక రూపొందించి కేంద్రానికి సమర్పించింది.

వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌కు కేబినెట్‌ ఆమోదం..
రామ్‌నాథ్‌ కోవింద్‌ సమర్పించిన నివేదికను కేంద్ర కేబినెట్‌ యథావిధిగా ఆమోదించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం(సెప్టెంబర్‌ 18న) సమావేశమైన కేంద్ర కేబినెట్‌ జమిలి ఎన్నికల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీంతో దేశ వ్యాప్తంగా లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నది కేంద్రం ముఖ్య ఉద్దేశం.

శీతాకాల సమావేశాల్లో బిల్లు..
కేబినెట్‌ ఆమోదించిన రామ్‌నాథ్‌ కోవింద్‌ నివేదిక మేరకు వచ్చే శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లు కేంద్రం బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంతకన్నా ముందు ఈ నివేదికను న్యాయ మంత్రిత్వ శాఖ ముందు 110 రోజులు ఉంచాలని కేంద్రం నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా వనరులను, సంపదను ఆదా చేయడంతోపాటు అభివృద్ధి, సామాజిక ఐక్యతను పెంపొందిస్తుందని కేంద్రం రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ నివేదికలో పేర్కొంది. ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడానికి జమిలి ఎన్నికలు దోహదపడతాయని తెలిపింది.

కోవింద్‌ నివేదికలో ఇలా..
ఇదిలా ఉంటే.. కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన రామ్‌నాథ్‌ కోవింద్‌ నివేదికలో ఏముంది అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ.. తన నివేదికలో జమిలి ఎన్నికలకు సమగ్ర రోడ్‌ మ్యాప్‌ రూపొందించింది. మొదటి విడతగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. తర్వాత వంద రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని సిఫారసు చేసింది. ఇందుకు రాజ్యాంగంలోని ఆర్టిక్‌ 18ని సవరించాలని సూచించింది. దీంతో రాష్ట్రాల అసెబ్లీల ఆమోదం అవసరం లేకుండానే ఎన్నికలు నిర్వహించే అవకాశం కలుగుతుందని తెలిపింది. ఈమేరకు రాజ్యాంగ సవరణలను పార్లమెంటులో ఆమోదం పొందాల్సి ఉంటుందని పేర్కొంది.

కమిటీ సిఫారసులు ఇవీ..
ఇక కోవింద్‌ కమిటీ కేంద్రానికి కొన్ని సిఫారసులు కూడా చేసింది. 

– రాష్ట్రాల ఎన్నికల అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం సంప్రదింపులు జరిపి కామన్‌ ఓటరు జాబితా, ఓటరు గుర్తింపు కార్డులను రూపొందించాలి.

– ప్రస్తుతం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యత వహిస్తుంది. మున్సిపాలిటీ, పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను రాష్ట్రాల ఎన్నికల కమిషన్‌లు చూసుకుంటున్నాయి. జమిలి ఎన్నికల్లోనూ ఇదే విధానం కొనసాగించాలి.