Homeజాతీయ వార్తలుUnion Budget Of India 2022: బడ్జెట్ ఎఫెక్ట్: ఈ వస్తువుల ధర పెరుగును.. వీటి...

Union Budget Of India 2022: బడ్జెట్ ఎఫెక్ట్: ఈ వస్తువుల ధర పెరుగును.. వీటి ధర తగ్గును..!

Union Budget Of India 2022: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌-2022ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే ఆసియాలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించిందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ బడ్జెట్ ప్రకారం..ఆర్థిక మంత్రి ప్రతిపాదించినట్లుగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో పలు వస్తువులు మరింత చౌకగా మారబోతున్నాయి. ఆదే క్రమంలో మరి కొన్ని వస్తువులు ఇంకా ఖరీదైనవిగా మారే చాన్సెస్ ఉన్నాయి.

Union Budget Of India 2022
Nirmala Sitharaman

నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదని విపక్షాలు విమర్శస్తున్నాయి. కాగా, పాతికేళ్ల విజన్ తో బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తన ప్రసగంలో తెలిపారు. ఇకపోతే ఈ బడ్జెట్ ప్రకారం.. ఎలక్ట్రానిక్ డివైజెస్ మొబైల్ ఫోన్లు, చార్జర్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ కూడా చౌకగా మారబోతున్నాయి. ఇక కట్ చేసి పాలిష్ చేయబడిన వజ్రాలు, రత్నాలపై కస్టమ్స్ డ్యూటీ ఐదు శాతం తగ్గించారు. ఇకపోతే భారత్‌లో తయారు చేయబడిన వ్యవసాయ రంగానికి సంబంధించిన పనిముట్లు, ఉపకరణాలపై మినహాయింపును పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ మినహాయింపు ద్వారా రైతులకు లాభం జరగనుంది. కేంద్రప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో అగ్రికల్చర్ కు ప్రయారిటీ ఇచ్చింది. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు తమది రైతు అనుకూల ప్రభుత్వమని చెప్తున్నారు.

Union Budget Of India 2022
Union Budget Of India 2022

Also Read: Union Budget Of India 2022: పాతికేళ్ల విజన్‌తో కేంద్ర బడ్జెట్.. ఉపాధి కల్పనకు అగ్ర తాంబూలం

చౌకగా లభించే వస్తువుల జాబితాలో బట్టలు, మొబైల్ ఫోన్ చార్జర్లు, రత్నాలు,వజ్రాలు, అనుకరణ ఆభరణాలు, మొబైల్ ఫోన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా యువతకు బాగా అవసరమైనవి. కాగా, వారు హ్యాపీగా వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. పెట్రోలియం ప్రొడక్ట్స్ కు అవసరమైన రసాయనాలపై కస్టమ్ డ్యూటీ ని తగ్గించారు. మిథనాల్‌తో పాటు కొన్ని రసాయనాలు , స్టీల్ స్క్రాప్‌పై రాయితీ మరో ఏడాది పాటు పొడిగించారు. ఆయా పరిశ్రమల వారికి ఈ నిర్ణయం లాభం చేకూరుస్తుంది. ఇక అన్ని రకాల దిగుమతి వస్తువులు ఖరీదైనవిగా మారనున్నాయ. గొడుగులపై భారీ సుంకాలను పెంచడంతో వీటి ధరలు భారీగా పెరగనున్నాయి. క్రిప్టో కరెన్సీ ట్రాంజాక్షన్స్ పైన 30 శాతం పన్నులు పెరగనున్నాయి. ఈ ధరులు ఖరీదైనవిగా మారనున్న నేపథ్యంలో అవసరమైన మేరకే వాటిపైన దృష్టి సారిస్తే మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Union Budget Of India 2022: వేతన జీవులపై అదే ‘పన్ను’ బాదుడు.. బడ్జెట్ పేరు గొప్ప.. ఊరు దిబ్బ?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular