Union Budget 2024: మూడోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2014, 2019 పార్లమెంటు ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ భారతీయ జనతాపారీట. తాజా 2024 ఎన్నికల్లో మాత్రం మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోలేకపోయింది. 270 సీట్లు అవసరం కాగా, 235 వద్దనే బీజేపీ ఆగిపోయింది. దీంతో ఎన్డీఏలోని టీడీపీ, జేడీఎస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆ రెండు పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు భారీగా ప్యాకేజీలు ఇచ్చారు. 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిన నిర్మలా సీతారామన్.. దేశంలో వ్యవసాయరంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇందన భద్రత, మౌలికరంగం, పరిశోధన–ఆవిష్కరణలు, తయారీ, సేవలు, తర్వాత తరం సంస్కరణలు అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. అయితే ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. ఇక బీహార్‌లో పలు ప్రాజెక్టుల కోసం రూ.26 వేల కోట్లు కేటాయించారు.
కీలక భాగస్వాములకు పెద్దపీట..
కేంద్రంలో మూడోసారి ఏర్పడిన ఎన్డీయే 3.0 కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జేడీఎస్ కీలక భాగస్వామిగా ఉన్నాయి. టీడీపీకి 16 మంది ఎంపీలు, జేడీఎస్‌కు 12 మంది ఎంపీలు ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జరిగిన ప్లామెంటు ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్‌కు ఫిగర్‌కు 40 సీట్ల దూరంలో ఆగిసోయింది. ఒంటిరిగా 235 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 270 స్తానాలు అవసరం ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందే ఎన్డీఏలో చేరిన టీడీపీ 16, జేడీఎస్ 12 సీట్లతోపాటు ఇతర చిర్న పార్టీల మద్దతులో మోదీ కేంద్రంలో మరోసారి ప్రధాని పదవి చేపట్టారు. టీడీపీ, జేడీఎస్ ఎన్డీఏ నుంచి బయటకు వస్తే.. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని సర్కార్ కుప్పకూలుతుంది. ఈ నేపథ్యంలోనే మోదీ 3.0 తొలి బడ్జెట్‌లోనే ఈ రెండు ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీగా నిధులు కేటాయించారు.
ప్రత్యేక హోదా ఇవ్వకుండా..
కేంద్రంలోని సంకీర్ణ సర్కార్‌లో కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జేడీఎస్ బడ్జెట్‌లో తమ రాష్ట్రాలకు భారీగా నిధులు కావాలని ముందే అడిగాయి. నితీశ్‌కుమార్ అయితే బిహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలని అసెంబ్లీలో తీర్మానం చేపి కేంద్రానికి పంపించారు. టీడీపీ తీర్మానం చేయకపోయినా రూ.లక్ష కోట్ల ప్యాకేజీ కావాలని కోరింది. అయితే మోదీ దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన, ఆలోచన తమ వద్ద లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు నిర్మలమ్మ తెలిపారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయిస్తామన్నారు. చెన్నై – విశాకపట్నం పారిశ్రామిక కారిడార్, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. ఇక బిహార్‌లో అభివృద్ధి పనులకు రూ.26 వేల కోట్లు, వదర సహాయం కింద మరో రూ11 వేల కోట్లు కేటాయించారు. కొత్త విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు ఆర్థిక సాయం. పీర్ పాయింట్ వద్ద 2,400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో సహా విద్యుత్ ప్రాజెక్టులు చేపడతామన్నారు.
దుమ్మెత్తి పోస్తున్న విపక్షాలు…
కేంద్రం తాజా బడ్జెట్‌లో కేవలం ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకే భారీగా నిధులు కేటాయించడంపై విపక్ష పార్టీలు మోదీ సర్కార్‌పై దుమ్మెత్తి పోస్తున్నాయి. అధికారాన్ని కాపాడుకునేందుకే ప్రధాని మోదీ టీడీపీ, జేడీఎస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయించారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ప్రధానిగా అన్ని రాష్ట్రాలను ఒకే దృష్టితో చూడాల్సిన మోదీ.. కేవలం తన పదవి పోకుండా చూసుకునేందుకే ఆ రెండు రాస్ట్రాలకు నిధులు కేటాయించారని విమర్శించారు. ఇక బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెడిడెంట్.. కేటీఆర్ కూడా స్పందించారు. తెలంగాణలో 8 మంది బీజేపీ, 8 కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా.. బడ్జెట్‌లో రాస్ట్రానికి ఏమీ తీసుకురాలేకపోయారని విమర్శించారు. భవిష్యత్ ప్రాంతీయ పార్టీలదే అనేందుకు ఈ బడ్జెట్ కేటాయింపులే నిదర్శనమన్నారు. టీడీపీ మద్దతులో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందునే ఆ రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించిందని తెలిపారు. తెలంగాణలో ప్రశ్నించే నాయకులు లేకపోవడంతో అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. దేశంలో అనేక వెనక బడిన రాష్ట్రాలు ఉన్నా.. కేంద్రం ఏపీ, బిహార్‌పైనే ప్రేమ కనబర్చిందని వివిధ పార్టీల నాయకులు విమర్శించారు.