Union Budget 2024: మూడోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించింది. ఇక 2024 ఎన్నికల్లో మాత్రం బీజేపీ మెజారిటీ సీట్లు సాధించలేదు. ఎన్డీఏలోని టీడీపీ, జేడీఎస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగేలా పద్దును రూపొందించారు. 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు. వ్యవసాయరంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివద్ధి, ఇందన భద్రత, మౌలికరంగం, పరిశోధన–ఆవిష్కరణలు, తయారీ, సేవలు, తర్వాత తరం సంస్కరణలు అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్టనుల నిర్మలమ్మ వివరించారు. ఇదిలా ఉంటే.. ఈ బడ్జెట్‌లో ఏన్డీఏలో ప్రభుత్వంలో కీలక భాగస్వామ్య పార్టీలు అయిన తెలుగుదేశం పార్టీ(టీడీపీ), జేడీఎస్ పార్టీలు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్. బిహార్‌కు భారీగా నిధులు కేటాయించారు. ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు, బిహార్‌లో పలు ప్రాజెక్టుల కోసం రూ.26 వేల కోట్లు కేటాయించారు.
అత్యధిక నిధులు ఆ రెండు రాష్ట్రాలకే..
కేంద్రంలో మూడోసారి ఏర్పడిన ఎన్డీయే 3.0 కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జేడీఎస్ కీలక భాగస్వామిగా ఉన్నాయి. టీడీపీకి 16 మంది ఎంపీలు, జేడీఎస్‌కు 12 మంది ఎంపీలు ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జరిగిన ప్లామెంటు ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్‌కు ఫిగర్‌కు 40 సీట్ల దూరంలో ఆగిసోయింది. ఒంటిరిగా 235 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 270 స్తానాలు అవసరం ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందే ఎన్డీఏలో చేరిన టీడీపీ 16, జేడీఎస్ 12 సీట్లతోపాటు ఇతర చిర్న పార్టీల మద్దతులో మోదీ కేంద్రంలో మరోసారి ప్రధాని పదవి చేపట్టారు. టీడీపీ, జేడీఎస్ ఎన్డీఏ నుంచి బయటకు వస్తే.. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని సర్కార్ కుప్పకూలుతుంది. ఈ నేపథ్యంలో మోదీ 3.0 తొలి బడ్జెట్‌లోనే ఈ రెండు ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీగా నిధులు కేటాయించారు. ఏపీలో రాజధాని అమరావతికి ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. నితీశ్‌కుమార్ నేతృత్వంలోని బీహార్‌కు పలు అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రకటించారు.
ప్రత్యేక హోదా ఇవ్వకుండా..
ఇదిలా ఉంటే.. ఎన్డీఏ సర్కార్‌లో కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జేడీఎస్ బడ్జెట్‌లో తమ రాష్ట్రాలకు భారీగా నిధులు కావాలని ముందే అడిగారు. నితీశ్‌కుమార్ అయితే బిహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలని అసెంబ్లీలో తీర్మానం చేపి కేంద్రానికి పంపించారు. టీడీపీ తీర్మానం చేయకపోయినా రూ.లక్ష కోట్ల ప్యాకేజీ కావాలని కోరింది. అయితే మోదీ దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన, ఆలోచన తమ వద్ద లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్లు, బీహార్‌లో అభివృద్ధి పనులకు రూ.26 వేల కోట్లు, వదర సహాయం కింద మరో రూ11 వేల కోట్లు కేటాయించారు. ఏపీలో పోలవరం త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. బిహార్‌లో ఎయిర్ పోర్టులు, రోడ్లు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ…
ఇదిలా ఉండగా ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు నిర్మలమ్మ తెలిపారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయిస్తామన్నారు. చెన్నై – విశాకపట్నం పారిశ్రామిక కారిడార్, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని వెల్లడించారు.
బీహార్‌కు ప్రత్యేక నిధులు
బీహార్‌లో కొత్త విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు ఆర్థిక సాయం. పీర్ పాయింట్ వద్ద 2,400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో సహా విద్యుత్ ప్రాజెక్టులు చేపడతారు. గయాలో ఇండస్ట్రియల్ నోడ్ అభివృద్ధి, పాట్నా – పూర్ణియా ఎక్స్ ప్రెస్ వే, బక్సర్ – భాగల్పూర్ హైవే, బోద్‌గయా – రాజ్‌గిర్ – వైశాలి – దర్బంగా, బక్సర్‌లో గంగానదిపై రూ.26 వేల కోట్లతో వంతెనల అభివృద్ధికి సాయం చేస్తామని నిర్మలమ్మ ప్రకటించారు. ఆక్సిలరేటెడ్ ఇరిగేషన్ ఫండ్ ద్వారా బీహార్‌లో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తామన్నారు. టెంపుల్ కారిడార్లు, నలంద యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు.
మోదీ భయపడ్డారా?
కేంద్రంలో ప్రస్తతం ఉన్నది పూర్తిగా సంకీర్ణ ప్రభుత్వమే. టీడీపీ, జేడీఎస్ పార్టీల్లో ఎవరు మద్దతు ఉపసంహరించుకున్నా మోదీ సర్కార్ పడిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు పార్టీలను ప్రధాని కీలక భాగస్వామిగా భావిస్తున్నారు. అందుకే ఆ పార్టీల అధినేతలు చంద్రబాబు నాయకుడు, నితీశ్‌కుమర్ ఎప్పుడు అడిగితే అప్పుడు అపాయింట్ మెంట్ ఇస్తున్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ఇద్దరు ముఖ్యమంత్రులు మోదీని రెండుసార్లు కలవడం ఇందుకు నిదర్శనం. భాగస్వాములను దూరం చేసుకుంటే తన పదవికి ముప్పు తప్పదనే భయంతోనే మోదీ తాజా బడ్టెట్ లో ఆయా రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయించారని నిపుణులు పేర్కొంటున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Union budget 2024 central government announces special packages for bihar and andhra pradesh
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com