Undavalli Arun Kumar: ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తనకు అవమానం జరిగిందంటూ లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సర్వత్ర ఇదే చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ అంశంపై కీలక కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి లక్ష్మీపార్వతిని పిలవకపోవడం సరైంది కాదని స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, శాసనసభలో ఎవరెవరు? పుస్తక సమీక్షలో ఉండవల్లి పాల్గొన్నారు. మండలి బుద్ధ ప్రసాద్ తో కలిసి పుస్తకావిష్కరణ చేశారు.
ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.. ఆయన ఏమన్నారంటే..లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ భార్య అని స్పష్టం చేశారు. లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ చాటుగా పెళ్లి చేసుకోలేదని.. అందరి సమక్షంలోనే బహిరంగ వేదిక మీద పెళ్లి చేసుకున్నారని గుర్తు చేశారు. అప్పట్లో ఆమె వల్లే తాను బతికానని ఎన్టీఆర్ చివరి రోజుల్లో చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఇవన్నీ తెలిసి కూడా లక్ష్మీపార్వతిని కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం సరికాదని తేల్చి చెప్పారు.
ఏపీలో రెండు సామాజిక వర్గాలే రాజకీయ ఫలాలను అనుభవిస్తున్నాయని ఉండవల్లి చెప్పుకొచ్చారు. డబ్బులు తీసుకొని ఓటు వేసే సంస్కృతి పోవాలని… దానికోసం కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలే అధికారాన్ని అనుభవిస్తున్నాయని గుర్తు చేశారు. ఇటువంటి సమయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి పార్టీ పెట్టి 16% ఓట్లు తెచ్చుకున్నారని.. అది అంత ఆషామాషీ విషయం కాదన్నారు. 1991 నుంచి చిరంజీవి పార్టీ పెట్టేవరకు… కొత్త పార్టీలేవి మూడు శాతం కంటే ఎక్కువ ఓట్లు రాబెట్టుకోలేకపోయాయని ఉండవల్లి అన్నారు. అందుకే నాడు చిరంజీవిని ప్రత్యేకంగా కలుసుకొని అభినందనలను తెలిపిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
నాడు చిరంజీవి పార్టీని కాంగ్రెస్లో కలపడం నాకు ఇష్టం లేదని ఉండవల్లి చెప్పుకొచ్చారు. తాను కాంగ్రెస్కు చెందిన వాడినైనను.. ప్రజారాజ్యం విలీన ప్రక్రియపై అయిష్టత చూపినట్లు తెలిపారు. బయటి నుంచి మద్దతు ఇవ్వండి తప్ప.. విలీనం చేయొద్దని చెప్పానని.. నాటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు. రాజకీయాలంటే కేవలం అధికారం అనుకోవడం కరెక్ట్ కాదని.. ఈ సందర్భంగా ఉండవల్లి అభిప్రాయపడ్డారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Undavallis sensational comments saying that praja rajyam should not merge with congress
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com