
Undavalli Arun Kumar- Pawan Kalyan: పవన్ అంటే ఒక సమ్మోహన అస్త్రం. పవన్ అంటే ఒక మేనియా. కోట్లాది మంది అభిమానులు ఆయన సొంతం. అందులో యువత, విద్యార్థులు, మహిళలు, నడివయస్కులు ..ఇలా అన్ని వర్గాల వారు ఉన్నారు. అంతెందుకు సెలబ్రెటీలు సైతం పవన్ కోసం పరితపిస్తారు. ఆయన క్రేజ్ ను చూసి ఆశ్చర్యానికి గురవుతారు. అటు సినిమాల్లో, ఇటు పొలిటికల్ గా పవన్ వ్యక్తిత్వాన్ని ఇష్టపడతారు. అందుకే ఆయన సన్నిహితులు అంటారు.. పవన్ అంటే వ్యక్తి కాదు.. వ్యసనంగా అభివర్ణిస్తారు. అయితే ఆయన రాజకీయరంగంలో ఉండడంతో ప్రత్యర్థులకు అతిశయోక్తిగా ఉంటుంది, కానీ కేవలం సినిమా రంగంలోనే కొనసాగి ఉంటే ఇంకా అశేషమైన జనం అభిమానించే వారు అన్న ఒక టాక్ ఉంది. అయితే పవన్ అటు సినిమాల్లోనూ.. ఇటు రాజకీయాల్లోనూ ప్రత్యేకంగా ట్రాక్ ను ఏర్పాటుచేసుకున్నారు. రెండు రంగాల్లోనూ అభిమానించే వారు ఆయన సొంతం.
ఇటీవల నెట్టింట్లో రెండు వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. జన సైనికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఒకటి ఖుషీ సినిమా దర్శకుడు , తమళి క్రేజీ డైరెక్టర్ ఎస్ జే సూర్యది కాగా.. ఇంకొకటి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ది. ఈ రెండు వీడియోలు పవన్ వ్యక్తిత్వాన్ని ఆ ఇద్దరి మాటలు ద్వారా ఇట్టే గ్రహించవచ్చు. జనసేన పదో ఆవిర్భావ సభ ఇటీవల జరిగింది. ఆ పార్టీ పదేళ్లు పూర్తిచేసుకుంది. ఆయన సినీరంగంలోకి వచ్చి 27 ఏళ్లు అవుతోంది. దీనిని పురస్కరించుకొని దర్శకుడు ఎస్ జే సూర్య ఒక వీడియో రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ అనేది ఒక పేరు కాదు, అది ఒక నమ్మకం. పవన్ కళ్యాణ్ గారు సినిమా తెరపైనే కాదు పొలిటికల్ గాను ఒక గ్రేట్ లీడర్. ప్రజలు కోసం మీరు చేసే పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం పవన్ కళ్యాణ్ నా ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకునే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను’ అంటూ సాగిన సూర్య వీడియో తెగ వైరల్ అయ్యింది,

ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ పవన్ క్రేజ్ చూసి ఫిదా అయిపోయారు. తొలిసారిగా పవన్ ను కలిసేసరికి ఎంగ్జయిటీకి గురైనట్టు చెప్పారు. ఐదేళ్ల కిందట పోలవరం ఇష్యూలో కేంద్రంలోని బీజేపీకి, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాల మధ్య వాదన,, సంవాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ నిజనిర్ధారణకు ప్రయత్నించారు. ఆ సమయంలో అనుభవమున్న ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలిసేందుకు రాజమండ్రి రానున్నట్టు సమాచారమిచ్చారు. కానీ ఉండవల్లి అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు ఇక్కడకు వస్తే మీతో మాట్లాడడం కుదరదని.. తానే వస్తున్నట్టు చెప్పి జనసేన కార్యాలయానికి వచ్చారు. వస్తూ వస్తూ మీరు పిలిచిందే తరువాయి మిమ్మల్ని చూడడానికి వచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఈ అవకాశం విడిచిపెట్టకూడదనే ఇక్కడకు వచ్చానని చెప్పడంతో పవన్ తో పాటు మీడియా ప్రతినిధులు నవ్వుకున్నారు. పవన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదని.. ఆయన అండతోనే రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగలిగాయని గంటాపథంగా చెప్పుకొచ్చారు. నాడు ఉండవల్లి పవన్ క్రేజ్ ను బయటపెట్టిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. జన సైనికులు సైతం కామెంట్లు పెడుతున్నారు.