Undavalli Arun Kumar: ఆంధ్రప్రదేశ్ విభజనపై అందరికి అనుమానాలు వ్యక్తమయ్యాయి. విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే ఇప్పటికే పోరాటాలు కూడా చేస్తున్నారు. అయినా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా రాష్ట్రం అధోగతి పాలవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను ధర్మాసనం విచారణకు స్వీకరించింది. విభవజన సమయంలో ఎలాంటి ప్రయోజనాలు ఏపీకి దక్కలేదనే వాదనలు వస్తున్నాయి.

రాష్ట్రాల విభజన సమయంలో ఏపీకి ఎలాంటి ప్రయోజనాలు దక్కలేదు. దీంతో రాష్ట్ర ఏర్పాటులో ఎలాంటి లాభాలు అందలేదు. ఫలితంగా రాష్ట్రంలో పరిస్థితి అధ్వానంగా మారుతోంది. దీనిపై ఉండవల్లి వేసిన పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టేందుకు ఉద్దేశించడంతో రాష్ట్రానికి మేలు జరుగుతుందా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
విభజన సమయంలో ఏపీకి రావాల్సిన వాటాలు దక్కలేదు. ఫలితంగా విభజన హామీలు లెక్కలోకి రాకుండా పోయాయి. ఇప్పటికే రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయినందున భవిష్యత్ లో తీసుకోబోయే చర్యల గురించి ప్రస్తావిస్తున్నారు. దీంతో ఉండవల్లి వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టి తద్వారా ఏపీకి రావాల్సిన లెక్కలను సరి చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ ధర్మాసనం ముందు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రస్తావనకు తెచ్చారు. దీంతో పిటిషన్ వేసి చాలా కాలం అయిందని గుర్తించారు. న్యాయమూర్తి సూచనను లెక్కలోకి తీసుకుని ఉండవల్లి పిటిషన్ ను త్వరగా విచారణ జరిపేందుకు నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే వారంలో ఈ పిటిషన్ విచారణకు రానుందని చెబుతున్నారు
[…] AP BJP: ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల సందర్శన బీజేపీకి బాగానే మైలేజ్ వచ్చింది. అటు ప్రాజెక్టుల పనుల పరిశీలనతో పాటు నిర్వాసితుల సమస్యలు తెలుసుకునేందుకు కార్యక్రమం చక్కటి వేదికగా నిలిచింది. రాష్ట్ర బీజేపీ నేతలు ఏకతాటిపైకి వచ్చి కార్యక్రమం నిర్వహించిన తీరు సర్వత్రా అభినందనలు అందుకుంది. శ్రీకాకుళం జిల్లా వంశధార ఫేజ్2 రిజర్వాయర్ నిర్మాణ పనుల పరిశీలనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బీజేపీ నాయకులు పదునైన మాటలతో అటు అధికార పక్షం వైసీపీకి, గతంలో అధికారం వెలగబెట్టిన టీడీపీకి బాగానే ఇరుకున పెట్టారు. రిజర్వాయర్ల నిర్మాణానికి సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల మనసులను సైతం దోచుకున్నారు. అధికార, విపక్షాలను తూర్పారపడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కడిగిపారేశారు. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటించిన ఆయన బీజేపీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురాగలిగారు. తొలిరోజు సందర్శించిన పాతపట్నం, పాలకొండ నియోజకవర్గాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో బీజేపీ నేతలకు సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. […]