ఆడవారితో పెట్టుకుంటే అంతే. చరిత్ర చెబుతున్నా చలనం రావడం లేదు. మనకు ఎన్నో పురాణాలు చెబుతున్నాయి. కానీ విదేశీయుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా తన కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగినితో లిప్ లాక్ పెట్టుకున్న వ్యవహారంలో బ్రిటన్ ఆరోగ్య మంత్రి మ్యాట్ హాన్ కాక్ పదవీచ్యుతుడైన సంఘటన చోటుచేసుకుంది.
కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో లాక్ డౌన్ నిబంధనలను స్వయంగా సదరు మంత్రే చూస్తున్నారు. అయితే ఆయనే హద్దు దాటడంతో పదవి కోల్పోవాల్సిన పరిస్థి ఏర్పడింది. చివరికి తన రాజీనామా పత్రాన్ని ప్రధానమంత్రి జాన్సన్ కు పంపించారు. ప్రధాని తక్షణమే ఆమోదించారు. దీనిపై బ్రిటన్ కు చెందిన ది సన్ పత్రి ఓ కథనం ప్రచురించింది.
ఆదాయపు పన్నుల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు హాన్ కాక్ తన కార్యాలయంలో ఓ ఉద్యోగిని నియమించుకున్నారు. ఆమెను తన కార్యాలయ ఆవరణలో ముద్దాడుతూ కెమెరా కంటికి చిక్కారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు మీడియాలో ప్రచురితమయ్యాయి. దీంతో దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. చివరికి బహిరంగ క్షమాపణ చెప్పారు. తాను చేసిన పనికి చింతిస్తున్నానని ఓ ప్రకటన విడుదల చేశారు. అయినా వేడి చల్లారకపోవడంతో రాజీనామా చేశారు.
రాజీనామా పత్రాన్ని బోరిస్ జాన్సన్ కు పంపించారు. దాన్ని వెంటనే ఆమోదించారు. కరోనా సమయంలో కఠిన మార్గదర్శకాలను జారీ చేయడం, వాటిని అంతే పకడ్బందీగా అమలు పరచడంలో హాన్ కాక్ సేవలు అందించారని కొనియాడారు. చిత్తశుద్ధితో పని చేసిన ఆయన ప్రొటోకాల్ ను ఉల్లంఘించడం బాధాకరమని చెప్పారు.