https://oktelugu.com/

అరె.. సడెన్ గా పడిపోయిన హాట్ బ్యూటీ !

తెలుగు ఇండస్ట్రీలో ఓ చిన్న సినిమాతో మొదట అనామకురాలిగా ఎంట్రీ ఇచ్చింది ‘నభా నటేష్’. కానీ ఆమె మొదటి సినిమా ఆగిపోయింది. అదే ఆమెకు కలిసొచ్చింది. సుధీర్ బాబు సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా అమ్మడుకు స్టార్ డమ్ దక్కలేదు. ఇంతలో పూరి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో హిట్ కొట్టి టాలీవుడ్‌ లో హాట్ బ్యూటీగా నభాకి ఫుల్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. వచ్చిన ఫాలోయింగ్ ను క్యాష్ చేసుకోవడానికి హాట్ అందాలతో […]

Written By:
  • admin
  • , Updated On : June 27, 2021 / 05:16 PM IST
    Follow us on

    తెలుగు ఇండస్ట్రీలో ఓ చిన్న సినిమాతో మొదట అనామకురాలిగా ఎంట్రీ ఇచ్చింది ‘నభా నటేష్’. కానీ ఆమె మొదటి సినిమా ఆగిపోయింది. అదే ఆమెకు కలిసొచ్చింది. సుధీర్ బాబు సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా అమ్మడుకు స్టార్ డమ్ దక్కలేదు. ఇంతలో పూరి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో హిట్ కొట్టి టాలీవుడ్‌ లో హాట్ బ్యూటీగా నభాకి ఫుల్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

    వచ్చిన ఫాలోయింగ్ ను క్యాష్ చేసుకోవడానికి హాట్ అందాలతో రెచ్చిపోయింది. నభా బోల్డ్ నెస్ కి అభిమానులు కూడా ఆమెకు జే కొట్టారు. మేకర్స్ కూడా ఆమెకే ఓటు వేశారు. మూడు సంవత్సరాల వరకూ నభా డేట్స్ దొరకని పరిస్థితి కూడా కనిపించింది ఆ మధ్య. కానీ కరోనా రాకతో సమీకరణాలు మారిపోయాయి. మూడు సినిమాల నుండి నభాని తప్పించారు.

    మరో సినిమా అయితే నభా పై షూట్ చేసిన తర్వాత కూడా ఆమెను తప్పించారు. ఆ సినిమానే చైతు – విక్రమ్ కె కుమార్ కలయికలో వస్తోన్న ‘థాంక్యూ’ సినిమా. నభా ప్లేస్ లో రాశి ఖన్నాను తీసుకున్నారు. పాపం నభాకి అప్పటి నుండి మళ్ళీ కొత్త సినిమా ఏది రాలేదు. సడెన్ గా కెరీర్ పడిపోతుంది అని ఊహించని నభా ఒక్కసారిగా షాక్ లోకి వెళ్ళిపోయింది.

    అయితే, నభాకి అవకాశాలు రాకపోవడానికి గల కారణం మాత్రం కనిపించడం లేదు. నిజమే.. నభా అద్భుతమైన నటి కాదు. అందుకే కదా ఇస్మార్ట్ శంకర్ లో ఎక్కువగా హాట్ హాట్‌గా నటించి సెగలు రేపింది. ఆ సెగలు ఈ బ్యూటీని స్టార్ హీరోయిన్ ను చేయలేకపోయింది. దాంతో స్పీడ్ గా కెరీర్ ను పోగొట్టుకుని రేసులో నుండి సడెన్ గా పడిపోయింది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతానికి అయితే ఛాన్స్ ల కోసం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్ తో వినోదం పంచుతూ రోజురోజుకూ రెచ్చిపోతుంది.