America on Taliban Rule: అప్ఘనిస్తాన్ దేశం విషయంలో అగ్రరాజ్యం అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా వివాదాస్పదమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. అప్ఘనిస్తాన్ లో తాలిబన్లు తిష్ట వేయడానికి అమెరికానే కారణం అన్న అపవాదును ఇప్పటికే మూట గట్టుకుంది. ఇక అప్ఘన్ లోని తమకు సహకరించిన వారి లిస్ట్ ను కూడా తాలిబన్లకు ఇచ్చి పెద్ద తప్పు చేసింది. ఇప్పుడు తాలిబన్లు వారిని వెంటాడి వేధించి మరీ చంపుతున్నారన్న ప్రచారం సాగుతోంది.
అప్ఘనిస్తాన్ విషయంలో తప్పు మీద తప్పు చేస్తూ వస్తున్న అమెరికా ఎట్టకేలకు తన పంథా మార్చుకుంది. తాలిబన్లకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. అప్ఘనిస్తాన్ లోని తాలిబన్ పాలనను అమెరికా ఇప్పట్లో అంగీకరించే ప్రసక్తే లేదని అధికారికంగా ప్రకటించింది. అమెరికా మిత్రదేశాలు సైతం ఇదే బాటలో పయనించనున్నాయి. అలాగే బలగాల ఉపసంహరణ తర్వాత దౌత్య కార్యాలయాలను ఉంచాలో.. లేదో ఇంకా నిర్ణయించుకోలేదని వైట్ హౌస్ ప్రకటించింది.
అప్ఘన్ లోని తాలిబన్ ప్రభుత్వానికి అధికారిక గుర్తింపు ఇవ్వాలంటే వారు కొన్ని హామీలు ఇవ్వాల్సి ఉంటుందని అమెరికా గతంలోనే స్పష్టం చేసింది. ఉగ్రమూకలకు అప్ఘాన్ ను కేంద్రంగా మార్చవద్దని తేల్చిచెప్పింది. మానవ హక్కులు, ముఖ్యంగా మహిళల స్వేచ్ఛకు భంగం వాటిల్ల వద్దని షరతు విధించింది.
కాగా కాబూల్ లో అమెరికా దౌత్య కార్యాలయాలను ఉంచాలని తాలిబన్లు కోరినట్లు అమెరికా తెలిపింది. కానీ దీనిపై అమెరికా ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అమెరికన్ల భద్రతకు తాలిబన్లు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కానీ అవన్నీ ఇంకా మాటల రూపంలోనే ఉన్నాయని.. వాటిని చేతల్లో పెట్టినప్పుడే తమ విశ్వాసం బలపడుతుందని తేల్చిచెప్పారు. తాలిబన్ల నుంచి తాము మరింత భరోసాను ఆశిస్తున్నామన్నారు.
ఆగస్టు 15న తాలిబన్లు అప్ఘనిస్తాన్ మొత్తం ఆక్రమించుకున్నాక అమెరికా సహా పలు దేశాల దౌత్య అధికారులంతా కాబూల్ విమానాశ్రయానికి తరలివెళ్లారు. అప్ఘన్ గడ్డపై నుంచి ప్రస్తుతం తవ్ స్వస్థలాలకు వెళుతున్నారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: U s statement that it will not recognize the taliban government
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com