Mahesh Babu Tweet About Sudheer Movie: తెలుగు తెరపై తిరుగులేని రారాజు మహేష్ బాబు(Mahesh babu).. ఘట్టమనేని కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి వారి ఫ్యామిలీ నుంచి ఉన్న ఏకైక హీరో అతడే. మెగా ఫ్యామిలీ నుంచి 10 మంది వరకూ హీరోలున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా ఉన్నారు. కానీ కృష్ణ ఫ్యామిలీ నుంచి చాలా తక్కువమందే ఉన్నారు.
హీరో మహేష్ కు తోడుగా అతడి బావ, చెల్లెలి సోదరుడు సుధీర్ బాబు(Sudheer Babu) హీరోగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాడు. తాజాగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే సినిమాతో మన మందుకు వచ్చాడు. ఇందులో సుధీర్ బాబు నటనకు ఇప్పటికే ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా ఈ సినిమా చూసిన మహేష్ బాబు తన బావ సుధీర్ పై ప్రేమతో పలు కామెంట్లు చేశాడు. అవిప్పుడు ఆసక్తికరంగా ఉన్నాయి.
శుక్రవారం రాత్రి ఈ సినిమా చూసిన మహేష్ బాబు తాజాగా ట్విట్టర్ వేదికగా సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. చిత్రబృందంలోని ప్రతి ఒక్కరిని అభినందిస్తూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు.
‘శ్రీదేవి సోడా సెంటర్ క్లైమాక్స్ అద్భుతం.. ఇదో క్లిష్టతరమైన ముగింపు. అద్భుతమైన ప్రేమ కథా చిత్రం. పలాస మూవీ తర్వాత కరుణకుమార్ మరోసారి సామాజిక కోణంలో చిత్రాన్ని తెరకెక్కించిన విధానం బాగుంది. సుధీర్ అద్భుతంగా నటించాడు. ఇప్పటివరకు వచ్చిన సినిమాలతో పోలిస్తే ‘సూరిబాబు’ పాత్ర సుధీర్ కెరీర్ లోనే ఓ మైలు రాయి.. నరేశ్, ఆనంది నటనతో మెప్పించారు. సినిమా విలువలు బాగున్నాయి. ఈ చిత్రాన్ని మిస్ కాకండి.. చిత్ర బృందానికి నా అభినందనలు అంటూ’ మహేష్ బాబు ట్వీట్ చేసి తన బావ సుధీర్ పై ప్రశంసలు కురిపించారు.
#SrideviSodaCenter… a raw and intense film with a hard-hitting climax. Director @Karunafilmmaker comes up with yet another bold film after Palasa 1978. @isudheerbabu, is absolutely brilliant!! His finest performance till date 👏👏👏
— Mahesh Babu (@urstrulyMahesh) August 27, 2021
.@ItsActorNaresh is effortless in yet another memorable performance. Special mention to @anandhiactress. She’s just perfect in the character of Sridevi. Brilliant visuals and outstanding background score can’t be missed!!
Congratulations once again to the entire team 👍— Mahesh Babu (@urstrulyMahesh) August 27, 2021
ఒక కులాల కుంపట్లలో నలిగిపోయిన అద్భుతమైన ప్రేమ కథా చిత్రంగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ ‘శ్రీదేవి సోడాసెంటర్’. సుధీర్ బాబు హీరోగా నటించాడు. సమాజంలోని కుల వ్యవస్థ, దాని వల్ల ఇబ్బందులను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారని ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ శుక్రవారం ఈ సినిమా రిలీజ్ అయ్యి థియేటర్స్ లో ఆడుతోంది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Mahesh babu watches sudheer babus sridevi soda center movie at home
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com