America vs China: ప్రపంచంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తూ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా క్వాడ్ (క్వాడిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్) పేరిట జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాతో ఓ కూటమి ఏర్పాటు చేసింది. దీంతో పసిఫిక్ మహాసముద్రంపై చైనా పెత్తనాన్ని ఎదుర్కొనే క్రమంలో పోరాటం సాగిస్తామని పేర్కొంటోంది. చైనా ఆధిపత్యాన్ని అడ్డుకుని దురాక్రమణలను దూరం చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఆకస్ పేరిట మూడు దేశాలతో మరో కూటమికి అంకురార్పణ చేసింది. అకస్ అంటే ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ దేశాల సమాహారం. దీంతో ఇండో పసిఫిక్ రీజియన్ లక్ష్యంగా చేసుకునే కూటమిగా సెప్టెంబర్ 15న ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండు కూటముల ద్వారా అమెరికా పెద్ద వ్యూహమే ఉందని అంతర్జాతీయ పరిణామాలను పరిశీలిస్తే తెలుస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఆసియా పసిఫిక్ లో భద్రత, శ్రేయస్సు కోసం అమెరికా అనుసరించే యుద్ధ వ్యూహాల్లో భాగమేనని తెలుస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో పెద్దరికానికి అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో కృత్రిమ దీవులను ఏర్పాటు చేస్తూ కొత్త జనావాసాలు ఏర్పాటు చేస్తోందని చెబుతోంది. ఆసియా ఖండంలో తన ఆధిపత్యాన్ని తగ్గించే క్రమంలోనే అమెరికా తన ప్రయత్నాలు సాగిస్తోంది.
క్వాడ్, అకస్ కూటములతో పసిఫిక్ మహాసముద్రంలో తన ఆధిపత్యాన్ని పెంచుకునే క్రమంలోనే అమెరికా పలు దేశాలతో కలిసి నడిచేందుకు సిద్దమవుతోంది. చైనా దూకుడును తగ్గించాలని భావిస్తోంది. ఇప్పటికే చైనా పొరుగు దేశాలతో అనుసరించే వైఖరితో దాయాది దేశాలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. దీంతో దాని పెద్దన్న పాత్రకు అడ్డుకట్ట వేసి దాని పొగరనచాలని చూస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకోసం ఇండియాను కూడా వాడుకుంటోందని చెబుతున్నారు. ఏదిఏమైనా అమెరికా తన విధానాల ద్వారా చైనా కుయుక్తులకు అడ్డుకోవాలని చూస్తోందని స్పష్టమవుతోంది.