అమెరికా ఎన్నికల డిబేట్: మైక్ ను కడిగిపారేసిన కమలాహారిస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో వాడి వేడి డిబేట్ హీట్ పెంచింది. డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి.. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్, రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్ మధ్య హోరాహోరీగా సాగింది. ఈ సందర్భంగా కమలా హ్యారిస్ ఈ భేటిలో రెచ్చిపోయారు. ఆద్యంతం మైక్ పెన్స్ పై స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబరిచారు. Also Read: సరికొత్త రికార్డ్: మోడీ.. ఓటమెరుగని బాటసారి..! అమెరికాలో కరోనా వ్యాప్తిని నిరోధించడంలో.. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి రక్షించడంలో […]

Written By: NARESH, Updated On : October 8, 2020 10:49 am
Follow us on

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో వాడి వేడి డిబేట్ హీట్ పెంచింది. డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి.. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్, రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్ మధ్య హోరాహోరీగా సాగింది. ఈ సందర్భంగా కమలా హ్యారిస్ ఈ భేటిలో రెచ్చిపోయారు. ఆద్యంతం మైక్ పెన్స్ పై స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబరిచారు.

Also Read: సరికొత్త రికార్డ్: మోడీ.. ఓటమెరుగని బాటసారి..!

అమెరికాలో కరోనా వ్యాప్తిని నిరోధించడంలో.. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి రక్షించడంలో అధ్యక్షుడు ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారని డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుల పాలనలోనే ట్రంప్ పాలన అత్యంత విఫలమైందని ఆమె నిప్పులు చెరిగారు. ట్రంప్ అసమర్థ పాలనతో 2 లక్షలమంది అమెరికన్లు కరోనా సోకి మృత్యువాత పడ్డారని.. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని ఆమె తీవ్ర విమర్శలు చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొదటి డిబేట్ అధ్యక్ష అభ్యర్థులైన ట్రంప్, జోబిడైన్ పోటీపడగా.. రెండో డిబేట్ అమెరికా ఉపాధ్యక్ష బరిలో నిలుచున్న డెమొక్రటిక్, రిపబ్లికన్ పోటీదారులు మైక్ పెన్స్, కమలాహారిస్ మధ్య సాగింది.

ఈ రెండో డిబేట్ లో భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఉగ్రరూపం చూపించారు. చైనా అంశం చర్చకు వచ్చినప్పుడు కమలా హ్యారిస్ చెలరేగిపోయారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల లక్షలాది మంది అమెరికన్లు ఉపాధి కోల్పోయారని.. వీధిన పడ్డారని ఆరోపించారు. చైనాతో ట్రేడ్ వార్ తో అధ్యక్షుడు ట్రంప్ ఏం సాధించారని కమలా హ్యారిస్ ప్రశ్నకు మైక్ పెన్స్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఈ ట్రేడ్ వార్ తో అమెరికాలో ఉత్పాదక వ్యవస్థ దెబ్బతిన్నదని ఆరోపించారు. తయారీ రంగానికి చెందిన 3 లక్షల మంది ఉపాధి కోల్పోయారని ఆమె ఆరోపించారు. ఈ చర్చలో మైక్ పెన్స్ సమాధానాలను తప్పు పడుతూ కమలా హ్యారిస్ రెచ్చిపోయారు.

మైక్ పెన్స్ పై కమలా పలు సందర్భాల్లో ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా ఈ డిబేట్ లో చైనాతో ట్రేడ్ వార్, కరోనా నియంత్రణ, అమెరికా ఆర్థిక పరిస్థితులు చర్చలో ప్రస్తావనకు వచ్చాయి. ఈ చర్చలో మైక్ పెన్స్ పై కమలా హ్యారిస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ట్రంప్ అమెరికాతో చిరకాలంగా సంబంధాలున్న అన్ని దేశాలను దూరం చేశారని కమలా హ్యారిస్ ఆరోపించారు. అమెరికాకు ఇప్పుడు మిత్రులు లేకుండా పోయారని మండిపడ్డారు.

Also Read: గాంధీ కుటుంబం ఇంతగా బరితెగించిందా?

ఇక మైక్ పెన్స్ అమెరికాను అగ్రరాజ్యంగా కొనసాగింపజేసేలా తమ ఎన్నికల ప్రణాళిక ఉందని.. అమెరికన్లే ఫస్ట్ అనే నినాదంతో పనిచేస్తున్నామని చెప్పారు. యువతకు ఉపాధిని కల్పించడానికి.. ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేసే దిశగా తాము ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ రెండో డిబేట్ లో కమలానే బాగా వాదించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.