https://oktelugu.com/

అమెరికా ఎన్నికలు: ట్రంప్‌ ఖాతాలోకి అలస్కా

అదేంటో.. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడూ లేని ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే పోలింగ్‌ ముగిసి.. వచ్చిన రిజల్ట్‌తో జో బైడెన్‌ గెలుపు తీరాలకు చేరారు. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌‌ దాటి ఆయనే ప్రెసిడెంట్‌ పీఠం అధిష్టించనున్నారు. అయితే.. ఓ గెలుపు ఇంకా కొలిక్కివచ్చినట్లు కాదు. ఇంకా ఆ దేశంలో కౌంటింగ్‌ నడుస్తూనే ఉంది. విచిత్రంగా నిన్న మరో రాష్ట్రంలో ట్రంప్‌కు ఆధిక్యం వచ్చింది. మరి దీంతో ఈ ఫలితాలు ఎటు మలుపు తిప్పుతాయా అని అనుమానం […]

Written By:
  • NARESH
  • , Updated On : November 13, 2020 / 03:03 PM IST
    Follow us on

    అదేంటో.. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడూ లేని ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే పోలింగ్‌ ముగిసి.. వచ్చిన రిజల్ట్‌తో జో బైడెన్‌ గెలుపు తీరాలకు చేరారు. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌‌ దాటి ఆయనే ప్రెసిడెంట్‌ పీఠం అధిష్టించనున్నారు. అయితే.. ఓ గెలుపు ఇంకా కొలిక్కివచ్చినట్లు కాదు. ఇంకా ఆ దేశంలో కౌంటింగ్‌ నడుస్తూనే ఉంది. విచిత్రంగా నిన్న మరో రాష్ట్రంలో ట్రంప్‌కు ఆధిక్యం వచ్చింది. మరి దీంతో ఈ ఫలితాలు ఎటు మలుపు తిప్పుతాయా అని అనుమానం కలుగుతోంది.

    Also Read: పేద దేశాల ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే కరోనా మందులు..?

    అధ్యక్ష స్థానాన్ని చేపట్టేందుకు 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సొంతం చేసుకుంటే.. మిగిలిన ఎన్నికల ఓట్ల లెక్కింపు గురించి పెద్దగా ఫోకస్ పెట్టరు. ఇప్పుడు జరిగింది కూడా అదే. అమెరికాలోని మొత్తం ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 538. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల లెక్క చూస్తే.. డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌కు 284 ఓట్లను సొంతం చేసుకున్నారు. ఇప్పటికే విజేతగా నిలిచారు. ఇక.. ట్రంప్ విషయానికి వస్తే ఆయనకు వచ్చిన మొత్తం ఎలక్టోరల్ ఓట్లు 214. వీరిద్దరికీ వచ్చిన ఓట్లను కలిపితే.. 498. అలస్కాలో మూడు ట్రంప్ ఖాతాలో పడ్డాయి. దీంతో ఆయన బలం 217కు చేరింది. ఇంకా ఫలితం తేలాల్సిన సీట్లు 37 వరకు ఉన్నాయి.

    Also Read: గెలుపు కోసం పార్టీల పోలిక, చీలిక వ్యూహం!

    వీటి ఫలితం ఎలా ఉన్నా పెద్దగా ప్రయోజనం ఉండదని అనాలసిస్ట్‌లు అంటున్నారు. ఎందుకంటే.. బైడెన్ కు కావాల్సిన మెజార్టీ వచ్చింది. ఇప్పుడు ప్రకటించే సీట్లతో పెద్దగా పనేమీ ఉండదు. లెక్కకు పనికి వస్తాయే తప్పించి.. తుది ఫలితం మీద ఎలాంటి ప్రభావం చూపవు. తాజాగా ట్రంప్ ఖాతాలోకి అలస్కా వచ్చి చేరింది. ఈ రాష్ట్రంలో కేవలం మూడు స్థానాలు ఉండటం.. అవి కాస్త రిపబ్లికన్లకు అండగా నిలిచిన విషయం తెలిసిందే.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

    అలస్కాలో గెలుపుతో సెనెట్‌లో ఒక సీటు మద్దతును సొంతం చేసుకునే అవకాశం లభించింది. ఈ రాష్ట్రంలో ట్రంప్ 56.9 శాతం ఓట్లను సొంతం చేసుకుంటే.. బైడెన్ 39.1 శాతం ఓట్లను పొందగలిగారు. సెనేట్‌లో రిపబ్లికన్ల బలం 50కి పెరిగింది. అయితే.. ఇప్పటికీ ట్రంప్‌ తన ఓటమిని అంగీకరించడం లేదు. అధికార మార్పిడికి అంగీకరించడం లేదు. వచ్చే ఏడాది జనవరి 20న బైడెన్ దేశాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ లోపు ట్రంప్‌ మరెన్ని వివాదాలు సృష్టిస్తారో చూడాలి.