ఇద్దరు ఏపీ ఐఏఎస్ లకు వారం రోజులు జైలు శిక్ష

మొత్తానికి ఏపీ ఐఏఎస్ అధికారులకు గట్టి శిక్ష పడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇద్దరు ఏపీ ఐఏఎస్ లకు ఏకంగా వారం రోజుల పాటు జైలు శిక్ష విధించింది. ఓ వైపు వైసీపీ ప్రభుత్వం ఆదేశాలు.. మరోవైపు కోర్టు ఆదేశాలు.. ఇద్దరివి అమలు చేయకుండా గమ్మున ఉన్న అధికారులకు గట్టి శిక్ష పడింది. దీంతో అడకత్తెరలో పోకచెక్కలా అధికారులు నలిగిపోతున్నారని అర్థమవుతోంది. ఏపీలో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు వారం రోజులు జైలు శిక్ష విధించింది. […]

Written By: NARESH, Updated On : June 22, 2021 6:11 pm
Follow us on

మొత్తానికి ఏపీ ఐఏఎస్ అధికారులకు గట్టి శిక్ష పడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇద్దరు ఏపీ ఐఏఎస్ లకు ఏకంగా వారం రోజుల పాటు జైలు శిక్ష విధించింది. ఓ వైపు వైసీపీ ప్రభుత్వం ఆదేశాలు.. మరోవైపు కోర్టు ఆదేశాలు.. ఇద్దరివి అమలు చేయకుండా గమ్మున ఉన్న అధికారులకు గట్టి శిక్ష పడింది. దీంతో అడకత్తెరలో పోకచెక్కలా అధికారులు నలిగిపోతున్నారని అర్థమవుతోంది.

ఏపీలో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు వారం రోజులు జైలు శిక్ష విధించింది. హైకోర్టు ఉత్తర్వులను ఎన్ని సార్లు ఆదేశించినా చేయకపోవడంతో సహనం నశించిన హైకోర్టు చివరికి శిక్ష విధించింది.

తమ ఉద్యోగాలను నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్ చేయాల్సి ఉన్న చేయలేదంటూ 36మంది ఉద్యోగులు గతంలో కోర్టును ఆశ్రయించారు. వారి పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు అందర్నీ రెగ్యులరైజ్ చేయాలని.. ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి రెగ్యులరైజ్ చేయకపోవడంతో వారు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. పలు మార్లు ఉత్తర్వులు అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ పట్టించుకోలేదు.

హైకోర్టు తమ ఆదేశాలు అమలు చేయాల్సిన బాధ్యతల్లో ఉండి నిర్లక్ష్యం ప్రదర్శించిన చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్ లకు వారం జైలు శిక్ష విధిస్తూ తీర్పుచెప్పింది. కోర్టు ధిక్కరణ కేసులో చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. వారి సమక్షంలో కోర్టు తీర్పు చెప్పి షాకివ్వడం విశేషం.

ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్లే ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయలేదని.. ఇప్పుడు వారు శిక్ష అనుభవిస్తున్నారని అధికారవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో అనేకమంది సివిల్ సర్వీసెస్ అధికారులపై కోర్టు ధిక్కరణ పిటీషన్లు పడ్డాయి.