https://oktelugu.com/

ట్విట్టర్ ట్రెండింగ్స్: ఈ ఏడాది దీని గురించే వెతికారు

కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. ఎప్పుడు ఏది ట్రెండింగ్ లో ఉంటే జనాలు దాని గురించే ఆలోచిస్తారు. అందుకే పవన్ ఒక సినిమాలో అన్నాడు.. ‘ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తాను’ అని.. అన్నట్టుగానే ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో ఒకటైన ట్విట్టర్ లో ఈ ఏడాది ట్రెండింగ్స్ హోరెత్తాయి. ఈ ఏడాది ప్రజలు అందరూ ఒకేదానిపై చర్చించారు. 2020 ముగుస్తుండడంతో ప్రజలు అత్యధికంగా చర్చించిన దానిపై తాజాగా […]

Written By:
  • NARESH
  • , Updated On : December 8, 2020 / 11:45 AM IST
    Follow us on

    కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. ఎప్పుడు ఏది ట్రెండింగ్ లో ఉంటే జనాలు దాని గురించే ఆలోచిస్తారు. అందుకే పవన్ ఒక సినిమాలో అన్నాడు.. ‘ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తాను’ అని.. అన్నట్టుగానే ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో ఒకటైన ట్విట్టర్ లో ఈ ఏడాది ట్రెండింగ్స్ హోరెత్తాయి. ఈ ఏడాది ప్రజలు అందరూ ఒకేదానిపై చర్చించారు. 2020 ముగుస్తుండడంతో ప్రజలు అత్యధికంగా చర్చించిన దానిపై తాజాగా ట్విట్టర్ సోమవారం బహిర్గతం చేసింది.

    Also Read: కరోనా బారినపడ్డ స్టార్ హీరోయిన్

    కరోనా మహమ్మారిపై అత్యధిక హ్యాష్ ట్యాగ్ ట్వీట్లు పడ్డాయని ట్విట్టర్ సంస్థ తెలిపింది. ప్రపంచంలోనే నంబర్ 1 ట్రెండింగ్ గా ఇదే మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి ట్వీట్లు చేశారు. ఇదే దేశంలో రెండో అత్యధిక హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ గా నిలిచింది.

    Also Read: భారత్ బంద్ పై ప్రధాని కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

    ఇక యూపీలోని హథ్రాస్ బాలికపై అత్యాచారంపై మూడో ట్రెండింగ్ గా ఉంది. క్రీడల్లో ఐపీఎల్, చెన్నై సూపర్ కింగ్స్ టీం, మహిళల ట్వీటంటీ ట్రెండింగ్ లో ఉన్నాయి. తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌ వేలాది మంది తన అభిమానులతో దిగిన సెల్ఫీ ఫొటోను గత ఫిబ్రవరిలో ట్విట్టర్‌లో పోస్టు చేయగా, ఈ ఏడాది అత్యధిక రిట్వీట్స్‌ అందుకుని గోల్డెన్‌ ట్వీట్‌గా నిలిచింది. అత్యధిక చర్చ జరిగిన తెలుగు సినిమాగా మహేష్‌బాబు, రష్మిక మందన్న నటించిన తెలుగు సినిమా సరిలేరునీకెవ్వరు నిలిచింది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    2020లో అత్యధికంగా ప్రపంచవ్యాప్తంగా చర్చించింది కరోనా మహమ్మారి గురించేనని ఆ సంస్థ తెలిపింది. కోవిడ్ కు సంబంధించిన న్యూస్, అప్ డేట్స్ పై ట్వీట్లు హోరెత్తాయని వివరించింది. ఇక ఆ తర్వాత కరోనా రిలేటెడ్ అయిన ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు కృతజ్ఞతలు తెలపడం ప్రపంచ వ్యాప్తంగా 20% పెరగ్గా, ప్రత్యేకంగా వైద్యులకు కృతజ్ఞతలు తెలపడం 135%, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలపడం 30% పెరిగింది.