https://oktelugu.com/

మహేశ్‌బాబు ‘ఒక్కడు’ వెనుక ఇంత కథ ఉందా..!

ప్రిన్స్ మహేష్ బాబును స్టార్ ను చేసిన సినిమా ‘ఒక్కడు’. క్లాస్ అభిమానులు ఉన్న మహేష్ కి మాస్ లో ఫుల్ ఫాలోయింగ్ పెరగడానికి కారణమైన తొలి చిత్రం కూడా ‘ఒక్కడు’ సినిమానే. 2003లో విడుదలైన ‘ఒక్కడు’ సినిమా ఇప్పటికీ కమర్షియల్ క్లాసిక్ గా నిలిచింది. ఈ జనరేషన్ ప్రేక్షకులు కూడా ఆ చిత్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ సినిమాకు ‘ఒక్కడు’ అని టైటిల్ పెట్టడం వెనుక ఆసక్తికరమైన కారణముందట. తొలుత ఈ సినిమాకు […]

Written By:
  • admin
  • , Updated On : December 8, 2020 / 11:49 AM IST
    Follow us on


    ప్రిన్స్ మహేష్ బాబును స్టార్ ను చేసిన సినిమా ‘ఒక్కడు’. క్లాస్ అభిమానులు ఉన్న మహేష్ కి మాస్ లో ఫుల్ ఫాలోయింగ్ పెరగడానికి కారణమైన తొలి చిత్రం కూడా ‘ఒక్కడు’ సినిమానే. 2003లో విడుదలైన ‘ఒక్కడు’ సినిమా ఇప్పటికీ కమర్షియల్ క్లాసిక్ గా నిలిచింది. ఈ జనరేషన్ ప్రేక్షకులు కూడా ఆ చిత్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ సినిమాకు ‘ఒక్కడు’ అని టైటిల్ పెట్టడం వెనుక ఆసక్తికరమైన కారణముందట. తొలుత ఈ సినిమాకు ‘అతడే ఆమె సైన్యం’ అనే పేరు అనుకుంది యూనిట్. అయితే అలాంటి టైటిల్‌ అప్పటికే రిజిస్టర్ అయినట్లు తెలిసింది. నిజానికి అప్పట్లో ఈ టైటిల్ నే ముందు ఎనౌన్స్ చేశారు కూడా.

    Also Read: నిహారిక జంట వీడియో వైరల్.. షూట్ చేసింది ఆ దర్శకుడే !

    కానీ అప్పటికే టైటిల్ వేరేవాళ్ళ రిజిస్టర్ చేయించుకున్నారని తెలిసి.. దాంతో ‘అతడే ఆమె సైన్యం’ టైటిల్ ను వదులుకున్నారు. ఆ తర్వాత ‘కబడ్డీ’ అనే టైటిల్ అనుకున్నప్పటికీ గుణశేఖర్‌కు నచ్చలేదట. చివరికి ఎన్నో రోజులు ఆలోచించి చివరికి ‘ఒక్కడు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా టాలీవుడ్‌లో అనేక రికార్డులు తిరగరాసింది. గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఎంఎస్ రాజు ఈ చిత్ర నిర్మాత. అయితే ఈ సినిమా వల్ల ఎంఎస్ రాజు ఫోన్ నంబర్ మార్చుకున్నారు. ఈ సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాస్ పోర్ట్ ఆఫీసర్ గా పనిచేస్తుంటారు. కొత్తగా మొబైల్ ఫోన్ కొన్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. తన ప్రియురాలికి నంబర్ చెబుతాడు.

    Also Read: ఉప్పెన’ రిలీజ్ ఎప్పుడంటే… అది మెగా ఇమేజ్ కే సాధ్యం !

    ఆ నంబర్ విన్న మహేష్ గ్యాంగ్ పాస్ పోర్ట్ కోసం టోనీ అనే పేరుతో అతడిని విసిగించే సన్నివేశం చాలా బాగా పేలింది. ఫోన్ నంబర్ గా ఎవరి నంబర్ ఉపయోగిద్దాం అని అనుకుంటుండగా.. ఎవరిదో ఎందుకు.. నిర్మాత నంబరే వాడేద్దాం అని ఎవరో సలహా ఇచ్చారట. దాంతో నిర్మాత రాజుగారి నంబర్ నే వాడారు. ఇక సినిమా విడుదలయ్యాక ఆ నంబర్ కు కొన్ని లక్షల కాల్స్ వెళ్లాయట. దీనితో నిర్మాత ఎంఎస్ రాజు నిజంగానే ఫోన్ నంబర్ మార్చుకోవాల్సి వచ్చింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్