రేపే విస్తరణ: కేంద్ర కేబినెట్ లోకి కొత్తగా 20 మంది?

వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. పడిపోతున్న మోడీ సర్కార్ గ్రాఫ్ ను తిరిగి పెంచడానికి బీజేపీ రెడీ అయ్యింది. యూపీ సహా ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలకు కేంద్ర కేబినెట్ లో పెద్ద పీట వేయనుంది. రేపు లేదా ఎల్లుండి మంత్రి మండలి విస్తరణకు మొగ్గు చూపుతోంది. దాదాపు కేంద్ర కేబినెట్ లోకి 20 మంది కొత్త వారికి అవకాశం కల్పిస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణపై ఎట్టకేలకు తుది కసరత్తు పూర్తి అయినట్లు […]

Written By: NARESH, Updated On : July 6, 2021 9:05 am
Follow us on

వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. పడిపోతున్న మోడీ సర్కార్ గ్రాఫ్ ను తిరిగి పెంచడానికి బీజేపీ రెడీ అయ్యింది. యూపీ సహా ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలకు కేంద్ర కేబినెట్ లో పెద్ద పీట వేయనుంది. రేపు లేదా ఎల్లుండి మంత్రి మండలి విస్తరణకు మొగ్గు చూపుతోంది. దాదాపు కేంద్ర కేబినెట్ లోకి 20 మంది కొత్త వారికి అవకాశం కల్పిస్తోంది.

కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణపై ఎట్టకేలకు తుది కసరత్తు పూర్తి అయినట్లు తెలుస్తోంది. మోడీ నేతృత్వంలో రెండోసారి కొలువదీరిన ఎన్డీఏ రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. కరోనాతో మోడీ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సాధారణ ప్రజలకు మేలు చేకూరేలా మోడీ చేయడం లేదన్న విమర్శలు వచ్చాయి. రాష్ట్రాల ఎన్నికల్లోనూ వరుసగా ఓటములు బాధిస్తున్నాయి.

సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్లు గడువు ఉన్నా కూడా రాబోయే ఎన్నికలపై ఫోకస్ చేస్తూ మంత్రివర్గ విస్తరణ చేయాలని మోడీ రెడీ అయిపోయారు. గత కొద్దిరోజులుగా ఢిల్లీలో బీజేపీకి లీడర్స్ వరుస భేటిలతో కేంద్ర కేబినెట్ పునర్వ్యస్తీకరణపై చర్చ మొదలైంది. మోడీ, అమిత్ షా దీనిపై కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ఇప్పటికే కేంద్రమంత్రులు, సహాయ మంత్రుల పనితీరుపై రిపోర్ట్స్ తెప్పించుకున్నారు. జూన్11 మోడీ, షా, నడ్డా కూడా భేటి అయ్యారు. మంత్రులను గ్రూపులుగా చేసి రివ్యూ జరిపారు.

బీజేపీకి మిత్రపక్షాలు దూరమవడం.. మంత్రుల మరణాలతో కేంద్ర కేబినెట్లో ఖాళీలు ఏర్పడ్డాయి. సీనియర్ మంత్రి, మిత్రపక్షం లోక్ జనశక్తి నేత రాంవిలాస్ పాశ్వాన్, కర్ణాటక బీజేపీ నేత సురేష్ అంగతి మృతితో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. శివసేన, అకాలీదళ్ దూరమైన నేపథ్యంలో వాటిని ఏదైనా ప్రాంతీయ పార్టీని ఆహ్వానించి భర్తీ చేసే అవకాశం ఉంది.

ఇక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈసారి వాటికే పెద్దపీట వేయనున్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలకు కేంద్ర కేబినెట్ లో ఎక్కువ మంత్రి పదవులు రానున్నాయి.

మెరుగైన పాలనను అందించేందుకు.. యువతకు, ఉత్సాహవంతులకు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ప్రధాని మోడీ భావిస్తున్నట్టు సమాచారం. శని, ఆదివారాల్లో మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రధాని మోడీ సహా 54 మంది కేంద్రమంత్రులున్నారు. మరో 25మందిని చేర్చుకోనున్నట్లు బీజేపీ వర్గాల్లో టాక్.

తెలంగాణ నుంచి కూడా మరొకరికి చాన్స్ దక్కే అవకాశాలున్నాయని సమాచారం. ఆదిలాబాద్ ఎస్టీ ఎంపీ బాపూరావుకు సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఏపీ నుంచి జీవీఎల్ నరసింహరావుకు ఈసారి చాన్స్ దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఏపీ నుంచి కేంద్ర కేబినెట్ లో ఎవరూ లేరు. ఈసారి చాన్స్ పక్కా అంటున్నారు. మరి ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.