TTD: దేశంలోని హిందువులు కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని కోరుకుంటారు. అయితే వృద్ధులు, వికలాంగులు క్యూలైన్లలో ఎక్కువ సమయం నిలబడి శ్రీవారి దర్శనానికి హాజరు కావడం అంత తేలిక కాదు. అయితే వృద్ధులు, వికలాంగులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపికబురు అందించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే వృద్ధులు, వికలాంగులకు స్పెషన్ దర్శనాన్ని కల్పిస్తోంది.

తాజాగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ వృద్ధులకు, వికలాంగులకు కేవలం అరగంటలోనే దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఉదయం 10 గంటల సమయంలో, సాయంత్రం 3 గంటల సమయంలో శ్రీవారిని ఉచితంగా దర్శించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. దర్శనానికి వచ్చే భక్తులు తమ ఫోటోలతో పాటు ఐడెంటిటీ కార్డును కచ్చితంగా కలిగి ఉండాలి.
వృద్ధులు, వికలాంగులు వయస్సు నిర్ధారణకు సంబంధించిన పత్రాలను, ఇతర ధృవీకరణ పత్రాలను ఎస్1 కౌంటర్ లో చూపించి కౌంటర్ నుంచి గుడికి, గుడి నుంచి కౌంటర్ కు బ్యాటరీ కారులో వెళ్లే ఛాన్స్ అయితే ఉంటుంది. దర్శనం కోసం వెళ్లే వృద్ధులకు వేడిపాలు, పెరుగన్నంతో పాటు సాంబార్ అన్నం ఇస్తారు. స్వామివారిని దర్శించుకునే సమయంలో ఎలాంటి తోపులాటలు, ఇబ్బందులు ఉండవు. ఈ విధంగా సీనియర్ సిటిజన్లు సులభంగా దర్శనం చేసుకోవచ్చు.
Also Read: YCP: ఎన్డీఏలోకి వైసీపీ చేరుతుందా? ఏంటి సంగతి?
వృద్ధులు, వికలాంగులు ఈ విధంగా సులువుగా దర్శనం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వృద్ధులు, వికలాంగులు ఎస్1 కౌంటర్ దగ్గర 20 రూపాయల రెండు లడ్డు టోకెన్లను, 25 రూపాయలకు సంబంధించి ఎన్నైనా లడ్డు టోకెన్లను పొందే అవకాశం అయితే ఉంటుంది.
YCP: ఎన్డీఏలోకి వైసీపీ చేరుతుందా? ఏంటి సంగతి?