Samantha: నువ్విక్కడ లేకున్నా నాకు భయంగా ఉంది అంటూ… సమంత పోస్ట్ 

Samantha: సమంత విడాకుల అనంతరం తనపై వచ్చిన రూమర్స్ అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టి, అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కి ప్రిపరేషన్స్ మొదలుపెట్టారు.  బాలీవుడ్ లో కూడా ఒక ప్రాజెక్ట్ ను ఓకే చేశారు అని సమాచారం. చైతు కూడా తన నెక్స్ట్ సినిమా థాంక్యూ షెడ్యూల్లో బిజీగా ఉన్నారు. సమంత చైతు విడిపోవడానికి కారణం సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ అంటూ మీడియా లో  రూమర్స్ కూడా వచ్చాయి.  వాటిని ఖండిస్తూ సమంత సమాధానం కూడా ఇచ్చారు. […]

Written By: Raghava Rao Gara, Updated On : October 18, 2021 4:38 pm
Follow us on

Samantha: సమంత విడాకుల అనంతరం తనపై వచ్చిన రూమర్స్ అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టి, అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కి ప్రిపరేషన్స్ మొదలుపెట్టారు.  బాలీవుడ్ లో కూడా ఒక ప్రాజెక్ట్ ను ఓకే చేశారు అని సమాచారం. చైతు కూడా తన నెక్స్ట్ సినిమా థాంక్యూ షెడ్యూల్లో బిజీగా ఉన్నారు. సమంత చైతు విడిపోవడానికి కారణం సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ అంటూ మీడియా లో  రూమర్స్ కూడా వచ్చాయి.  వాటిని ఖండిస్తూ సమంత సమాధానం కూడా ఇచ్చారు. ప్రీతమ్ కూడా సమంత నాకు అక్క లాంటిది అని చెప్పుకొచ్చారు.

ఫిట్నెస్ ఈ విషయంలో సమంత ఎప్పుడూ ముందుంటారు. అయితే ఇప్పుడు తాజాగా సమంత తన జిమ్ ట్రైనర్ స్నేహ దేషును ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.  ‘నీకు నాపై ఇంత అధికారం ఎలా వచ్చింది. స్నేహ దేషు… నువ్విక్కడ లేకున్నా నాకు భయంగా ఉంది. వేరొకరి కోసం అయితే 30 కిలోల డంబెల్ నేను అస్సలు ఎత్తను, నీకోసం చేయాల్సి వస్తోంది అంటూ పోస్ట్ చేసింది.

ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో లేడి ఓరియంటెడ్ పాత్రలో తెరకెక్కనున్న చిత్రం శాకుంతలం. ఈ చిత్రం పౌరాణిక గాధతో తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తి అయ్యింధాని మూవీ యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దసరా కానుకగా జ్ఞానశేఖర్ అనే డెబ్యూ దర్శకుడితో సమంత కొత్త చిత్రం ఉండబోతోందని ప్రకటించింది. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు ప్రకటించారు.