TTD
TTD: తిరుమలలో భక్తుల భద్రత కోసం టిటిడి కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటిని శరవేగంగా అమలు చేస్తోంది. ప్రధానంగా భక్తుల కోసం ఊత కర్రలను సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా కాలినడక మార్గంలో వన్యప్రాణుల సంచారం అధికమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక చిన్నారి ప్రాణాన్ని చిరుత పులి బలిగొంది. గత నెలలోనే ఓ బాలుడు పై చిరుత దాడి చేసింది. ప్రాణం తీసినంత పని చేసింది. ఈ తరుణంలో కాలినడక మార్గంలో చిన్నారుల ప్రవేశంపై, రాకపోకలపై టీటీడీ ఆంక్షలు విధించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే కాలినడకలో పిల్లలకు ప్రవేశంగా నిర్ణయించింది.
శేషాచలం కొండల్లో వన్యప్రాణులు అధికమయ్యాయని టీటీడీ గుర్తించింది. కరోనా సమయములో కొద్దిరోజుల పాటు స్వామి వారి దర్శనం నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాలినడక మార్గం సైతం నిలిచిపోయింది. దీంతో పక్కనే ఉన్న శేషాచలం అడవుల నుంచి పెద్ద ఎత్తున వన్యప్రాణులు కాలినడక మార్గం సమీపంలో సంచరించాయి. అయితే అనూహ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవి భక్తులపై దాడి చేస్తున్నాయి. చిరుతలతో పాటు ఎలుగుబంట్లు సైతం స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తూ టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా భక్తులకు ఊత కర్ర ఇవ్వాలని నిర్ణయించుకుంది.
అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు కాలినడక వెళ్లే భక్తులకు చేతి కర్రల పంపిణీ ప్రారంభమైంది. ఒక్కో భక్తుడికి ఒక్కో చేతి కర్రను పంపిణీ చేస్తున్నారు. టీటీడీ వాలంటీర్లు, సిబ్బంది ద్వారా వీటిని సరఫరా చేస్తున్నారు. ఎప్పటికీ వీటి సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అదే సమయంలో అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో పెద్ద ఎత్తున భద్రతా సిబ్బంది మోహరించారు. మరోవైపు భక్తుల చేతికి ఊత కర్రలా అంటూ టీటీడీ నిర్ణయం పై సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కర్రలతో పులులు, సింహాలను వేటాడాలా? అని సెటైర్లు పడుతున్నాయి.భద్రత అంటే కర్రలు ఇవ్వడం కాదు.. రక్షణ గోడలు బలోపేతం చేయాలని ఎక్కువమంది సూచిస్తున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ttd started distribution of wooden sticks to devotees on the walkway to tirumala
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com