Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన టికెట్లు విడుదల చేసింది. ఒక్కో టికెట్ ధర రూ. 300లుగా నిర్ణయించారు. విడుదల చేసిన టికెట్లు 45 నిమిషాల్లోనే 3.35 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో భక్తులు దేవుడి దర్శనానికి ఎంతగా వేచి ఉన్నారో అర్థం అవుతుంది. దర్శన టికెట్ల కోసం 7 లక్షల హిట్లు వచ్చాయంటే భక్తులు ఎంత ఆసక్తి చూపిస్తున్నారో తెలుస్తోంది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే దర్శన టికెట్ల బుకింగ్ పూర్తి కావడం విశేషం.

గతంలో టికెట్ల బుకింగ్ లో అనేక సమస్యలు తలెత్తేవి. దీంతో భక్తులు ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. క్లిక్ చేసిన నిమిషాల్లోనే టికెట్లు బుక్ అవుతున్నాయి. దీంతో దర్శనం చేసుకోవాలనుకునే వారికి ఎలాంటి కష్టాలు ఉండడం లేదు. ఇంతకుముందు సర్వర్ ఇబ్బందులతో టికెట్ల బుకింగ్ కావడంలో చాలా ఆలస్యం అయ్యేది. సమయం ఎక్కువ తీసుకోవడంతో భక్తులు ఎదురు చూసేవారు కాదు. కానీ ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా టికెట్లు బుక్ కావడంతో నిమిషాల్లోనే లక్షల్లో అమ్ముడు అవుతున్నాయి.
రోజుకు 12 వేల చొప్పున టీటీడీ దర్శన టికెట్లు విడుదల చేసింది. సర్వదర్శనం టోకెట్లను టీటీడీ అక్టోబర్ 23న విడుదల చేయనుంది. నవంబర్ నెలకు సంబంధించి రోజుకు 10 వేల చొప్పున టికెట్లను విుదల చేయనుంది. అక్టోబర్ 25న నవంబర్ నెలకు సంబంధించి వసతి గదుల కోటా విడుదల చేయనుంది.
మొత్తానికి ఆన్ లైన్ టికెట్లు అందుబాటులోకి రావడంతో భక్తులకు కష్టాలు తప్పాయి. గంటల కొద్ది క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా పోయింది. నిమిషాల్లో ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకుని దర్శనం కోసం వెళుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనలో ఎన్నో వ్యయప్రయాసలు తప్పాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దర్శనం కోసం వెళ్లే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.