https://oktelugu.com/

టీటీడీ ఈవోను బదిలీ చేసిన జగన్.. అసలు కారణం అదేనా?

వైసీపీ సర్కార్ గద్దెనెక్కగానే టీడీపీ ప్రభుత్వంలో నియామకమైన ఈవో సింఘాల్ ను పక్కన పెడుతారానే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. కానీ ఏడాదిన్నరగా ఆయనే ఉన్నారు. అయితే సీఎం తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం.. అవి బుధవారం రాత్రి ముగియగానే బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. Also Read: అన్ లాక్ 5.0లో పాఠశాలలు తెరుస్తారా…? విద్యార్థుల భవిష్యత్తేంటి..? ఇటీవల తిరుమల చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ప్రతి విషయంలోనూ తిరుమల వివాదాలు జాతీయ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 1, 2020 / 09:37 AM IST
    Follow us on

    వైసీపీ సర్కార్ గద్దెనెక్కగానే టీడీపీ ప్రభుత్వంలో నియామకమైన ఈవో సింఘాల్ ను పక్కన పెడుతారానే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. కానీ ఏడాదిన్నరగా ఆయనే ఉన్నారు. అయితే సీఎం తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం.. అవి బుధవారం రాత్రి ముగియగానే బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.

    Also Read: అన్ లాక్ 5.0లో పాఠశాలలు తెరుస్తారా…? విద్యార్థుల భవిష్యత్తేంటి..?

    ఇటీవల తిరుమల చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ప్రతి విషయంలోనూ తిరుమల వివాదాలు జాతీయ స్థాయిలో ప్రచారానికి కారణమవుతోంది. ఈ క్రమంలోనే దృష్టిసారించిన జగన్ సర్కార్ టీటీడీ ఈవోను బదిలీ చేస్తూ అదే సమయంలో ఆయనకు అత్యున్నత పదవిని ప్రభుత్వంలో కల్పించడం విశేషంగా మారింది.

    తిరుమల బ్రహ్మోత్సవాలు ముగియగానే జగన్ సర్కార్ ఈ తీసుకుంది. సడన్ గా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోను బదిలీ చేసింది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై ఎట్టకేలకు జగన్ సర్కార్ బదిలీ వేటు వేసింది. సింఘాల్ రెండేళ్ల పదవీకాలం ముగిసినా వైసీపీ ప్రభుత్వం ఆయన్నే ఈవోగా కొనసాగించింది. ప్రస్తుతం బదిలీ చేస్తూ అత్యున్నత పదవిని కట్టబెట్టింది.

    అయితే సింఘాల్ ను డిమోషన్ కింద పంపకుండా అత్యున్నత పోస్టును కట్టబెట్టింది. అనిల్ కుమార్ సింఘాల్ ను ఏకంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించడం విశేషం.

    Also Read: టీటీడీ ఈవోను బదిలీ చేసిన జగన్.. అసలు కారణం అదేనా?

    ఇక ప్రస్తుతం టీటీడీ అడిషినల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న ఏవీ ధర్మారెడ్డికి పూర్తి స్థాయి అదనపు ఈవోగా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది. ధర్మారెడ్డి 1991వ బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. 1993 బ్యాచ్ ఐఏఎస్ అయిన సింఘాల్ ను టీడీపీ ప్రభుత్వం 2017 మే నెలలో టీటీడీ ఈవోగా నియమించింది. తెలుగు వారి కానీ సింఘాల్ నియమించడం అప్పట్లో దుమారం రేపింది.