
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. 1993 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అనిల్‌కుమార్ సింఘాల్.. 2017 మే నుంచి టీటీడీలో విధులు నిర్వహిస్తున్నారు. సామాన్యులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో అనేక సంస్కరణలు చేశారు.టీటీడీ అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి పూర్తి బాధ్యతలను అప్పగించారు. అయితే కొత్త ఈవోగా జవహర్‌రెడ్డిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా ఉన్నారు. కాగా అనిల్‌కుమార్ సింఘాల్‌ను అకస్మాత్తుగా బదిలీ చేయడం చర్చకు దారి తీసింది.