బాబయ్ ను వదలని జగన్.. మళ్లీ టీటీడీకి వైవీనే

నాడు ఎన్నికల వేళ ప్రకాశం జిల్లా ఎంపీ టికెట్ ఇవ్వకుండా పక్కనపెట్టేశారు వైఎస్ జగన్. అధికారంలోకి రాగానే అత్యున్నత నామినేటెడ్ పదవి అయిన టీటీడీ చైర్మన్ ను చేశారు. అయితే ఈ పదవి నాకు చాలు.. ఇక వద్దు అని వైవీ సుబ్బారెడ్డి స్వయంగా మొత్తుకున్నా కూడా జగన్ ఆలకించలేదు. మరో రెండున్నరేళ్లు.. వైసీపీ అధికారంలో ఉండేదాకా బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ పదవిలోనే కూర్చుండబెట్టారు ఏపీ సీఎం. మొన్నటివరకు టీటీడీ చైర్మన్ గా వైవీ […]

Written By: NARESH, Updated On : August 8, 2021 8:35 pm
Follow us on

నాడు ఎన్నికల వేళ ప్రకాశం జిల్లా ఎంపీ టికెట్ ఇవ్వకుండా పక్కనపెట్టేశారు వైఎస్ జగన్. అధికారంలోకి రాగానే అత్యున్నత నామినేటెడ్ పదవి అయిన టీటీడీ చైర్మన్ ను చేశారు. అయితే ఈ పదవి నాకు చాలు.. ఇక వద్దు అని వైవీ సుబ్బారెడ్డి స్వయంగా మొత్తుకున్నా కూడా జగన్ ఆలకించలేదు. మరో రెండున్నరేళ్లు.. వైసీపీ అధికారంలో ఉండేదాకా బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ పదవిలోనే కూర్చుండబెట్టారు ఏపీ సీఎం.

మొన్నటివరకు టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డినే ఉండేవారు. ఆ పదవి తనకు వద్దని.. రెన్యూవల్ అవసరం లేదని స్వయంగా వైవీ సుబ్బారెడ్డినే ఈ మధ్య ప్రకాశం జిల్లా పర్యటనలో చెప్పుకొచ్చాడు. అయినా కూడా జగన్ మరోసారి టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డినే నియమిస్తూ తాజాగా తర్జనభర్జనల నడుమ ఉత్తర్వులు జారీ చేశారు.

వైవీ సుబ్బారెడ్డి గతంలో ప్రకాశం ఎంపీగా ఉండేవారు. మాగుంటను చేర్చుకొని సొంత బాబాయ్ కు టికెట్ ను జగన్ నిరాకరించారు. అది అప్పట్లో సంచలనమైంది. న్యాయం చేయడానికి అని టీటీడీ బోర్డు పదవి ఇచ్చారు. ఇటీవలే తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఉందని.. రాజ్యసభ సీటు కావాలని పరోక్షంగా వైవీ సుబ్బారెడ్డి అన్నట్టుగా ప్రచారం సాగింది. అయితే వైవీ సుబ్బారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకున్న జగన్ మాత్రం ససేమిరా అన్నట్టుగా తెలుస్తోంది.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాలు.. కుల రాజకీయాల కారణంగా సొంత బాబాయికి నచ్చజెప్పి మరో రెండేళ్ల పాటు టీటీడీ చైర్మన్ గా ఉండాలని సూచించినట్టు తెలిసింది. దీంతో అసంతృప్తిగానైనా వైవీ సుబ్బారెడ్డి మళ్లీ బాధ్యతలు చేపట్టారు. ఈసారి క్షత్రియులకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారని అనుకున్నప్పటికీ మళ్లీ వైవీ సుబ్బారెడ్డికే చాన్స్ ఇవ్వడం విశేషంగా చెప్పొచ్చు.

ఇక వైవీ సుబ్బారెడ్డితోపాటు పాలక మండలి సభ్యులను కూడా త్వరలో నియమించాల్సి ఉంది.పదవుల కోసం పెద్ద ఎత్తున పోటీ ఉండడంతో జగన్ వీటి విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది.