వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. కేసు సీబీఐకి అప్పగించడంతో కదలిక వస్తోంది. ఒక్కొక్కటిగా నిజాలు వెలుగు చూస్తున్నాయి. దర్యాప్తు తీరుపై మొదట్లో ఆరోపణలు వచ్చినా తరువాత సీబీఐ జోరు పెంచింది. వివేకా ఇంటి వాచ్ మెన్ రంగయ్య సమాచారంతో కేసులో పురోగతి కనిపిస్తోంది. డ్రైవర్ దస్తగిరి, మరో వ్యక్తి సునీల్ యాదవ్ లను కూడా అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు సైతం బయటపడ్డాయి. కస్టడీలో ఉన్న సునీల్ యాదవ్ అందించిన వివరాలతో ఆయుధాలను పులవెందులలోని ఓ మురుగు కాలువలో పడేసినట్లు సమాచారం.
అయితే ఆమురుగు కాలువ చాలా లోతుగా ఉండడంతో అందులోని నీరంతా తోడేస్తున్నారు. అందులోని నీరంతా తోడితేనే అందులో ఉన్న ఆయుధాలు దొరికే అవకాశాలు లేకపోవడంతో సీబీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఆదివారం ఆయుధాలు బయట పడితే దర్యాప్తుల మరింత వేగం పుంజుకోనుంది. ఇవి కీలకంగా మారనున్నాయి. దీంతో సీబీఐ వివేకా హత్య కేసులో లోతైన అధ్యయనం జరగుతోంది. కీలకసాక్ష్యాలు సంపాదించి కేసును మలుపు తిప్పాలని భావిస్తోంది.
వివేకానందరెడ్డి హత్య జరిగి దాదాపు రెండేళ్లు పూర్తయింది. హత్యాయుధంపై ఉన్న వేలి ముద్రలు ఉన్నా అవి ఎలా గుర్తిస్తారో తెలియడం లేదు. అయితే ఆ గుర్తులు చెరిగిపోకుండా ఉంటే హంతకులను పట్టుకోవడం తేలిక అవుతుంది. కానీ ఇన్ని రోజులు ఆ గుర్తులు అలాగే ఉంటాయా అనే విషయాలు ఆసక్తి రేపుతున్నాయి. దీంతో సీబీఐ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు విజయం సాధిస్తాయోనని అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దీంతో సీబీఐ వేగం పెంచుతున్నా పరిస్థితుల ప్రభావం వల్ల కేసు పురోగతి సాధించడం లేదు. ఆయుధాలు దొరికితేనే కేసు ముందుకు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మురుగు కాలువలో పడేసిన ఆయుధాలు స్వాధీనం చేసుకుంటే కేసులో ఎంతో కొంత మేర పట్టు దొరుకుతుంది. అందుకే సీబీఐ ప్రత్యేకంగా తీసుకుని ఆధారాల కోసం వెతుకుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై నిజానిజాలు వెల్లడయ్యేందుకు ఇంకా సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.