https://oktelugu.com/

TSPSC : గ్రూప్-1 దరఖాస్తుపై టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన

వరుసగా రెండుసార్లు పరీక్ష రద్దు కావడంతో నిరుద్యోగుల్లో గ్రూప్‌-1పై ఆసక్తి తగ్గినట్లు అనిపిస్తోంది. గతంలో గ్రూప్‌-1కు 3.80 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి పోస్టులు పెరిగినా దరఖాస్తులు తగ్గాయి.

Written By:
  • NARESH
  • , Updated On : March 14, 2024 / 09:31 PM IST

    TSPSC

    Follow us on

    TSPSC : తెలంగాణ ప్రభుత్వం గ్రూప్‌-1కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. ‍గ్రూప్‌-1 దరఖాస్తు గడువు గురువారం(మార్చి 14)తో ముగియడంతో టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకట చేసింది. దరఖాస్తు గడువును మరో రెండు రోజులు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈనెల 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.

    కొత్తగా నోటిఫికేషన్‌
    గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 503 పోస్టులతో 2022, ఏప్రిల్‌లో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఇచ్చింది. అదే ఏడాది అక్టోబర్‌ 16న ప్రిలిమ్స్‌ నిర్వహించింది. ఫలితాలు కూడా ప్రకటించింది. అయితే ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం బయటకు రావడంతో పరీక్షను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. కొత్తగా 2023, జూన్‌ 11న మళ్లీ పరీక్ష నిర్వహించింది. అయితే ఈసారి అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకోలేదు. దీంతో కొంతమంది హైకోర్టును ఆశ్రయించడంతో ఆ పరీక్షను కూడా హైకోర్టు రద్దు చేసింది. దీంతో టీఎస్‌పీఎస్సీ పనితీరుపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. టీఎస్‌పీఎస్సీని రద్దు చేయాలన్న డిమాండ్‌ పెరిగింది. నాటి మంత్రి కేటీఆర్‌ పీఏపైనా ఆరోపణలు వచ్చాయి. లీకేజీ వ్యవహారంలో అరెస్టులు కూడా జరిగాయి. ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ అధిరకారంలోకి వచ్చింది.

    టీఎస్‌పీఎస్సీ రద్దు..
    కొత్త ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజులకే టీఎస్‌పీఎస్సీ సభ్యులు రాజీనామా చేశారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి టీఎస్‌పీఎస్సీని ప్రక్షళణ చేశారు. నూతన కమిటీని ఏర్పాటు చేశారు. మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియమించారు. తర్వాత టీఎస్‌పీఎస్సీ గత గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. కొత్తగా 60 పోస్టులను జోడింది 623 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చింది.

    తగ్గిన అప్లికేషన్లు..
    వరుసగా రెండుసార్లు పరీక్ష రద్దు కావడంతో నిరుద్యోగుల్లో గ్రూప్‌-1పై ఆసక్తి తగ్గినట్లు అనిపిస్తోంది. గతంలో గ్రూప్‌-1కు 3.80 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి పోస్టులు పెరిగినా దరఖాస్తులు తగ్గాయి. గురువారం(మార్చి 14) నాటికి 2.7 లక్షల మంది అప్లై చేసుకున్నారు. దీంతో టీఎస్‌పీఎస్సీ గడువు పెంచింది. గడువు ముగిసే నాటికి దరఖాస్తులు 3 లక్షల దాటే అవకాశం కనిపించడం లేదు.