https://oktelugu.com/

EC : ఎన్నికల వేళ ఈసీలో కీలక పరిణామం.. కేంద్రం అనూహ్య నిర్ణయం

అనంతరం న్యాయ‌శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్‌, హోంశాఖ కార్యదర్శి, రక్షణ వ్యవహారాల శాఖ కార్యదర్శ స‌భ్యులుగా ఉన్న సెర్చ్ క‌మిటీ ప్రతిపాదించిన పేర్లపై చ‌ర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇచ చీఫ్‌ ఎలక‌్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయనున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : March 14, 2024 9:43 pm
    Follow us on

    EC : కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న రెండు కమిషనర్‌ పోస్టులను కేంద్రం భర్తీ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ముగ్గురు స‌భ్యుల సెలక‌్షన్‌ కమిటీ ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించింది. కేర‌ళ‌కు చెందిన మాజీ ఐఏఎస్ జ్ఞానేశ్‌కుమార్‌, పంజాబ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ సుఖ్‌భీర్ సింగ్‌సంధును సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. ఎంపిక అనంతరం క‌మిటీ స‌భ్యుల‌లో ఒక‌ర‌యిన‌ కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్‌చౌద‌రి మీడియకు వివరాలు వెల్లడించారు.

    సెలక్షన్‌ కమిటీ తొలి నియామకాలు..
    ఎన్నికల కమిషనర్ల నియామకాల కోసం సుప్రీం కోర్టు సెలక్షన్‌ కమిటీ ఏర్పాటు చేసింది. కొత్త కమిటీ ఏర్పాటు తర్వాత మొదటి నియామకాలు ఇవే. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయల్‌ పదవికి రాజీనామా చేశారు. మరో కమిషనర్‌ అనూప్‌ పాండే ఫిబ్రవరిలో పదవీ విరమణ చేశారు. దీంతో ముగ్గురు సభ్యులు ఉండే కేంద్ర ఎన్నికల సంఘంలో చీఫ్‌ ఎలక‌్షన్‌ కమిషనర్‌ ఒక్కరే మిగిలారు. దీంతో కమిటీ హుటాహుటిన సమావేశమై కొత్తగా ఇద్దరు కమిషనర్లను నియమించింది. ఈ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపి గెజిట్‌ విడుదల చేయాల్సి ఉంది. ఆ వెంటనే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉంది.

    కమిటీలో వీరు..
    సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సెలక‌్షన్‌ కమిటీలో ప్రధానమంత్రితోపాటు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో కాంగ్రెస్‌ నాయకుడు అధిర్‌రంజన్‌ చౌదరి సభ్యులుగా ఉన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ కమిటీ గురువారం సమావేశమైంది. అనంతరం న్యాయ‌శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్‌, హోంశాఖ కార్యదర్శి, రక్షణ వ్యవహారాల శాఖ కార్యదర్శ స‌భ్యులుగా ఉన్న సెర్చ్ క‌మిటీ ప్రతిపాదించిన పేర్లపై చ‌ర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇచ చీఫ్‌ ఎలక‌్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయనున్నారు.