కరోనా నేపథ్యంలో పాఠశాలలు గత మార్చి నుంచి మూతపడ్డాయి. వైరస్ సృష్టించిన భయానికి అందరు కూడా బాధ్యులు అయ్యారు. ప్రపంచమే అతలాకుతలం అయింది. కరోనా మొదటి, రెండో దశల్లో ప్రాణాలు సైతం పిట్టల్లా రాలిపోయాయి. కరోనా భయంతో అందరు ఇళ్లకే పరిమితమైపోయారు. లాక్ డౌన్ విధించి వ్యాధి నిర్మూలనకు అందరు సహకరించారు. కానీ రోజురోజుకు విద్యావిధానం దూరమైపోతోంది. విద్యార్థులు ఇళ్లకే పరిమితం కావడంతో వారిలో సామర్థ్యాలు తగ్గిపోతున్నాయనే ఆందోళనల నేపథ్యంలో బుధవారం నుంచి పాఠశాలల ప్రారంభానికి చర్యలు తీసుకుంది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో గురుకులాలు మినహా మిగతావి ప్రారంభించుకోవచ్చని సూచించడంతో నేటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతున్నాయి.
ప్రభుత్వం బుధవారం నుంచి పాఠశాలలు ప్రారంభానికి పచ్చ జెండా ఊపింది. ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలా? పరోక్ష తరగతుల నిర్వహణా అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ బోధనా? ఆఫ్ లైన్ బోధనా అనే దానిపై పాఠశాలల యాజమాన్యాల నిర్ణయమే అని తెలిపింది. అయితే ప్రభుత్వ గురుకులాలు, వసతి గృహాలు మాత్రం తెరవడానికి వీల్లేదని తెలిపింది. దీంతో ప్రత్యక్ష బోధనపై ఇంకా అందరిలో భయం పుట్టుకొస్తున్న క్రమంలో గురుకులాలను మాత్రం ప్రారంభించొద్దని సూచించింది. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందోననే అనుమానాలు వ్యక్తమైనా సర్కారు పాఠశాలల ప్రారంభానికి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులతో చర్చించారు. పాఠశాలల ప్రారంభానికి ఆమోదం తెలిపారు. హైకోర్టు ఆదేశాలకనుగుణంగా పలు అంశాలపై స్పష్టత ఇస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ర్టంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు కూడా బుధవారం నుంచి ప్రారంభించుకోవచ్చని తెలిపింది. ప్రత్యక్ష తరగతులు, వసతి గృహాలను సైతం తెరుచుకోవచ్చని సూచించింది.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాలయాల నిర్వహణ కొనసాగించుకోవచ్చు. భౌతిక దూరం పాటిస్తూ ఉండాలి. మాస్కులు ధరించడం తప్పనిసరి. పాఠశాలలను శానిటైజర్ చేసుకోవాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొవిడ్ బారిన పడకుండా ఉఫాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీలు, వసతి గృహాలు సైతం నిబంధనల ప్రకారం తెరుచుకోవచ్చని చెప్పారు.
పాఠశాలల ప్రారంభానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 16 నుంచే ప్రారంభించి తరగతుల నిర్వహణ కొనసాగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించాలని భావించినా హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో కోర్టు ఆధేశాల మేరకు గురుకులాలు తప్ప మిగతా సంస్థలు తెరుచుకోవచ్చని చెప్పిన నేపథ్యంలో వాటిని పాటిస్తూ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటూ కొవిడ్ బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.