https://oktelugu.com/

HariHara Veeramallu: పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ అప్పుడే?

HariHara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు కరెక్ట్ పాత్ర దొరికితే ఎలా చెడుగుడు ఆడేస్తాడన్నది ఇటీవల ‘వకీల్ సాబ్’సినిమాలో చూశాం. ఆ సినిమాలో పవన్ వీరావేశం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. కాసుల వర్షం కురిపించింది. అలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్లు కావాలని పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాడు. ఈ క్రమంలోనే క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ పురాతన కాలంలో తెలుగు గడ్డపై పోరాడిన బందిపోటు ‘హరిహర వీరమల్లు’ కథను ఎంచుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 1, 2021 / 01:45 PM IST
    Follow us on

    HariHara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు కరెక్ట్ పాత్ర దొరికితే ఎలా చెడుగుడు ఆడేస్తాడన్నది ఇటీవల ‘వకీల్ సాబ్’సినిమాలో చూశాం. ఆ సినిమాలో పవన్ వీరావేశం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. కాసుల వర్షం కురిపించింది. అలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్లు కావాలని పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాడు. ఈ క్రమంలోనే క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ పురాతన కాలంలో తెలుగు గడ్డపై పోరాడిన బందిపోటు ‘హరిహర వీరమల్లు’ కథను ఎంచుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా కొద్దిరోజులు నడిచి ఆగిపోయింది.

    భీమ్లా నాయక్ షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ ఈ చారిత్రక మూవీ ‘హరిహర వీరమల్లు’ను పక్కనపెట్టాడు. హరీబరీగా తీయకుండా నెమ్మదిగా ప్రశాంతంగా తీయడానికి.. ఉన్నత విలువలతో సినిమా రావడానికి గ్యాప్ ఇచ్చాడు.

    ఇక ఈ ఖాళీ టైంలో దర్శకుడు క్రిష్ ‘కొండపొలం’ అనే సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో దసరాలోపు ‘బీమ్లా నాయక్’ మూవీని పూర్తి చేసి పండుగ తర్వాత మళ్లీ ‘వీరమల్లు’ సినిమా షూటింగ్ లో బిజీ కావాలని పవన్ డిసైడ్ అయినట్లు సమాచారం. దసరా తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నదని ఇప్పటికే పవన్ డేట్స్ కేటాయించినట్టు తెలిసింది.

    ఎట్టి పరిస్థితుల్లోనూ బీమ్లా నాయక్ మూవీని దసరాలోపు పూర్తి చేయాలని పవన్ అల్టిమేటం జారీ చేశారట.. దీనికోసం ఏకధాటిగా షూటింగ్ లో పాల్గొంటున్నాడట..

    కాగా ‘హరిహర వీరమల్లు ’ మూవీని క్రిష్ ఇప్పటికే ఫస్ట్ ఆఫ్ పూర్తి చేసినట్టు సమాచారం. ఇంకో ఐదురోజులు బ్యాలెన్స్ ఉంది. దసరా తర్వాత సెకండాఫ్ ను పూర్తి చేయనున్నాడు. క్రిష్ సినిమాలను జెట్ స్పీడుతో పూర్తి చేస్తాడు. ఈ క్రమంలోనే దసరాలో పు అన్ని సెట్ లను రెడీ చేసి పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట.. ఎలాగైనా సరే 2021 డిసెంబర్ లోపు సినిమాను పూర్తి చేసి 2022 వేసవిలో ‘వీరమల్లు’ చిత్రాన్ని విడుదల చేయాలని క్రిష్ పట్టుదలగా ఉన్నట్టు సమాచారం.