దేశాన్ని ఇప్పటి వరకు కరోనా వైరస్ భయపెడుతుంటే… ఇప్పుడు బ్లాక్ ఫంగస్ మరింత కుంగదీస్తోంది. మొదట్లో ఉత్తరాదిలో మొదలైన బ్లాక్ ఫంగర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు పాకింది. రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదై అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.ఈ నేపథ్యంలో దీనిపై తెలంగాణ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ పై కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ పంగస్ లక్షణాలను ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు గుర్తించి ప్రభుత్వానికి తెలియజేయాలని తెలిపింది. ప్రతీరోజు దీనికి సంబంధించిన రిపోర్టు ఆరోగ్యశాఖకు పంపించాలని ఆశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆదేశాలిచ్చారు.
గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్రలో మొదట్లో బ్లాక్ పంగస్ కేసులు నమోదయ్యాయి. కరోనా వచ్చి తగ్గిన వారిలో దగ్గు,జ్వరం, ఛాతిలో నొప్పి ఉంటే పరీక్షలు చేయగా బ్లాక్ పంగస్ బయటపడుతోంది. కరోనా చికిత్సలో అధికంగా స్టెరాయిడ్స్ ఇవ్వడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. అందువల్ల మోతాదుకు మించి స్టెరాయిడ్స్ ఇవ్వొద్దని సూచిస్తున్నారు. ఇక కరోనా చికిత్సలో భాగంగా వాడే ఆక్సిజన్ హ్యూమిడిఫయర్లలో స్టెరైల్ నీటిని కాకుండా సాధారణ నీటిని ఉపయోగించడం వల్ల బ్లాక్ ఫంగస్ కు కారణమని అహ్మదాబాద్ కు చెందిన సీనియర్ కార్డియాలాజిస్ట్ అతుల్ అభ్యంకర్ తెలిపారు.
డయాబెటిస్ ఉన్నవారికి అధికంగా బ్లాక్ ఫంగస్ భారిన పడే అవకాశం ఉందంటున్నారు. బ్లాక్ ఫంగస్ కళ్లు, ముక్కు, నోటి భాగాలపై ప్రభావం చూపుతుంది. ఫంగస్ ముక్కు నుంచి మెదడుకు చేరితే మరణం సంభవించే ప్రమాదం ఉంటుంది. అయితే బ్లాక్ ఫంగస్ కొత్త వ్యాధి కాదని, దానికి చికిత్స ఉందని అంటున్నారు వైద్యులు. సకాలంలో చికిత్స తీసుకుంటే కోలుకుంటారంటున్నారు.
ఇక తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బ్లాక్ ఫంగస్ కు చికిత్స మొదలు పెట్టింది. హైద్రాబాద్లోని కోఠి ఈఎన్టీ ఆసుపత్రిని ఇటీవలే నోడల్ కేంద్రంగా మార్చింది. కాగా కేంద్ర ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ ను ఇప్టపికే ఎపిడమిక్ యాక్ట్ 1897లో చేర్చింది.