యథా రాజా తథా ప్రజ అంటారు. రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. ఇక్కడ ముఖ్యమంత్రి ఎలా ఉంటే మంత్రులు అలా ఉంటారు. ఏపీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సీఎం జగన్, మంత్రులు మాస్కులు ధరించకుండా రావడంపై అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరు పాలకులా? పశువులా? అనే ప్రశ్న తలెత్తుతోంది. మొదటి వేవ్ లో ఏదో సర్దుకుపోయినా ప్రస్తుతం సెకండ్ వేవ్ ఆందోళన కరంగగా ఉంది. వైద్యనిపుణులు రెండు మాస్కులు ధరించాలని చెబుతున్నా పరిపాలకులే పెడచెవిన పెడుతున్నారు.
ఆదర్శంగా ఉండాల్సినా..
ప్రజాప్రతినిదులు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సి ఉన్నా వారే బాధ్యతలు మరిస్తే ఎలా అని పలువురు విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష నేత నారా లోకేష్ ట్విటర్ వేదికగా మాస్కు ధరించని సీఎంపై ఘాటు విమర్శలు చేశారు. మాస్కు ధరించి మనిషిలా ప్రవర్తించాలని ట్వీట్ చేశారు. దీనికైనా జగన్ స్ప్ందించాలి. మాస్కు ప్రాధాన్య్తత గుర్తించ అందరికీ చెబుతూ తాను ధరించాలి.
సెకండ్ వేవ్ ప్రమాదకరంగా..
సెకండ్ వేవ్ రాష్ర్టంలో భయాందోళనకు గురి చేస్తోంది. మాస్కు లేకుండా మూకుమ్మడిగా సభలకు రావడం ఏమిటని సామాన్యుడు సైతం ప్రశ్నిస్తున్నాడు. జగన్ ఇలా తప్పులు చేస్తే ఎలా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. సీఎం మాస్కు ధరించకపోవడంపై పెద్ద దుమారమే చెలరేగుతోంది.
కరోనా కట్టడికి..
కరోనా కట్టడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కానీ సాక్షాత్తు సీఎం జగనే మాస్కు ధరించకపోవడంతో ప్రజల్లో అసహనం పెరుగుతోంది. సెకండ్ వేవ్ ప్రమాదం నుంచి రక్షించడానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో చెప్పాలని ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నాయి. అయినా ప్రభుత్వం ే విధమైన ప్రణాళికలు సిద్ధం చేసిందో చెప్పడం లేదు. ఫలితంగా ప్రతిపక్షాలు సైతం గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కరోనా కట్టడికి మార్గాలు వేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.సీఎం గారూ మాస్క్ వేసుకోరా?
యథా రాజా తథా ప్రజ అంటారు. రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. ఇక్కడ ముఖ్యమంత్రి ఎలా ఉంటే మంత్రులు అలా ఉంటారు. ఏపీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సీఎం జగన్, మంత్రులు మాస్కులు ధరించకుండా రావడంపై అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరు పాలకులా? పశువులా? అనే ప్రశ్న తలెత్తుతోంది. మొదటి వేవ్ లో ఏదో సర్దుకుపోయినా ప్రస్తుతం సెకండ్ వేవ్ ఆందోళన కరంగగా ఉంది. వైద్యనిపుణులు రెండు మాస్కులు ధరించాలని చెబుతున్నా పరిపాలకులే పెడచెవిన పెడుతున్నారు.
ఆదర్శంగా ఉండాల్సినా..
ప్రజాప్రతినిదులు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సి ఉన్నా వారే బాధ్యతలు మరిస్తే ఎలా అని పలువురు విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష నేత నారా లోకేష్ ట్విటర్ వేదికగా మాస్కు ధరించని సీఎంపై ఘాటు విమర్శలు చేశారు. మాస్కు ధరించి మనిషిలా ప్రవర్తించాలని ట్వీట్ చేశారు. దీనికైనా జగన్ స్ప్ందించాలి. మాస్కు ప్రాధాన్య్తత గుర్తించ అందరికీ చెబుతూ తాను ధరించాలి.
సెకండ్ వేవ్ ప్రమాదకరంగా..
సెకండ్ వేవ్ రాష్ర్టంలో భయాందోళనకు గురి చేస్తోంది. మాస్కు లేకుండా మూకుమ్మడిగా సభలకు రావడం ఏమిటని సామాన్యుడు సైతం ప్రశ్నిస్తున్నాడు. జగన్ ఇలా తప్పులు చేస్తే ఎలా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. సీఎం మాస్కు ధరించకపోవడంపై పెద్ద దుమారమే చెలరేగుతోంది.
కరోనా కట్టడికి..
కరోనా కట్టడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కానీ సాక్షాత్తు సీఎం జగనే మాస్కు ధరించకపోవడంతో ప్రజల్లో అసహనం పెరుగుతోంది. సెకండ్ వేవ్ ప్రమాదం నుంచి రక్షించడానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో చెప్పాలని ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నాయి. అయినా ప్రభుత్వం ే విధమైన ప్రణాళికలు సిద్ధం చేసిందో చెప్పడం లేదు. ఫలితంగా ప్రతిపక్షాలు సైతం గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కరోనా కట్టడికి మార్గాలు వేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.