TS Election Results 2023: తెలంగాణలో బీఆర్‌ఎస్ భారీ మెజారిటీ ఆశిస్తున్న నియోజకవర్గాల్లో సిరిసిల్ల ఒకటి. సిద్దిపేట, గజ్వేల్‌తోపాటు సిరిసిల్లలో భారీగా ఓట్లు వస్తాయని గులాబీ పార్టీ ఆశలు పెట్టుకుంది. ఇక్కడి నుంచి కేసీఆర్ తనయకుడు, ముఖ్యమైన మంత్రి కేటీఆర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇప్పటికే నాలుగుసార్లు గెలిచారు. కానీ, తాజా ఎన్నికల్లోల ఆయన తొలి రౌండ్‌లో వెనుకబడ్డారు.
తొలి రౌండ్‌లో కాంగ్రెస్ ముందంజ
సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన తొలి రౌండ్‌లో ఆధిక్యం కనబర్చారు. పోస్టల్ బ్యాలెట్‌లో బీఆర్‌ఎస్‌కు ఆధిక్యం రాగా, ఈవీఎం తొలి రౌండ్‌లో కేకే మహేందర్‌రెడ్డి సంచలనం సాధించారు. 265 ఓట్ల ఆధిక్యం కనబర్చారు. అసలు రికార్డు మెజారిటీ వస్తుందనుకన్న చోట.. వెనుకబడడమే ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఓవరాల్‌గా కేటీఆర్ గెలుస్తారని అచనా వేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో బీఆర్‌ఎస్ గెలుస్తుందని అన్నీ తేల్చాయి.