TS Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోల పాత బస్తీ కీలకం. ఇక్కడి ఆరు, ఏడు స్థానాలు ఎప్పుడూ ఎంఐఎం ఖాతాలోకే వెళ్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఎంఐఎం తెలంగాణలో పదేళ్లు అధికార బీఆర్‌ఎస్‌తో మద్దతుగా కొనసాగుతోంది. ఈసారి కూడా ఏడు స్థానాలు వస్థాయని అంచనా వేశారు. అయితే నాంపల్లిని కోల్పోతుందని కాంగ్రెస్ చెబుతోంది.
9 స్థానాల్లో పోటీ..
ఎంఐఎం పాతబస్తీలోని ఏడు స్థానాలతోపాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్‌లోనూ ఈసారి పోటీకి దిగింది. అయితే ఫలితాలు మాత్రం పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. కార్వాన్, యాకత్‌పురా, గోషామహల్‌లో బీజేపీ ఆధిక్యం కనబర్చడం ఆసక్తిగా మారింది. చాంద్రాయన గుట్టలో అక్బరుద్దీన్ ఒక్కరే మంచి ఆధిక్యంలో ఉన్నారు. మొతగా ఎంఐఎం మూడు స్థానాల్లో మాత్రమే ఆధిక్యం కనబరుస్తోంది.
కాంగ్రెస్ కూడా..
నాంపల్లి, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్‌లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. ఇక్కడ ఎంఐఎం రెండో స్థానానికే పరిమితమైంది. అధికార బీఆర్‌ఎస్ సీట్లు కోల్పోతున్నట్లుగానే, దాని మిత్రపక్షం కూడా సీట్లు కోల్పోతుందన్న చర్చ జరుగుతోంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తక్కువ ఓట్లు పోల్ అయినందునా.. ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు. మొత్తంగా పాతబస్తీలో తొలి రెండు రౌండ్లలో మూడు నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యం కనబర్చడమే ఆసక్తిగా మారింది.