Five Items At Home: ఇప్పుడున్న కాలంలో డబ్బు ప్రధానంగా ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి పని డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. దీంతో చాలామంది డబ్బు సంపాదించాలని ఆరాటపడుతూ ఉంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ ఎక్కువ సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. కానీ కొందరు ఎంత కష్టపడినా అనుకున్న ఆదాయం లభించదు. కొందరు మాత్రం చిన్న చిన్న పనుల ద్వారా ఎక్కువ డబ్బు సంపాదిస్తూ తొందరగా ధనవంతులు అవుతారు. మరి ఈ వ్యత్యాసం ఎందుకు? అని ఇప్పటికే చాలామందికి సందేహాలు వచ్చాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో ఉండడం వల్ల పరిస్థితులు మారి అనుకున్నంత డబ్బు సంపాదించవచ్చు అని కొందరు పండితులు చెబుతున్నారు. మరి వాస్తు శాస్త్రం ప్రకారం ఏం చేస్తే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు?
కొందరి ఇళ్లల్లోకి వెళ్లినప్పుడు వారి ఇంట్లో విచిత్రమైన బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఆకర్షణ కోసం ఉంచారని అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇలాంటి బొమ్మలను ఇంట్లో ఉంచుతారు. ఇలా అలంకరణగా ఉండే బొమ్మల్లో ఏనుగు బొమ్మలు ఒకటి. సాధారణంగా ఏనుగు బొమ్మలను ఎవరు ఇంట్లో ఉంచుకోరు. కానీ వాస్తు శాస్త్రం గురించి తెలిసినవారు మాత్రం ఈ బొమ్మలను విడిచిపెట్టరు. ఎందుకంటే ఏనుగు బొమ్మలను లక్ష్మీ దేవతతో సమానంగా భావిస్తారు. ఇవి ఇంట్లో ఉండడంవల్ల లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లవుతుందని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. అయితే వీటిని పూజ గదిలో ఉంచొచ్చు. లేదా అలంకరణగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
చాలామందికి కప్పలను చూడగానే భయం వేస్తుంది. ఇవి ఎక్కువగా చెరువులు, కుంటల్లో మాత్రమే కనిపిస్తాయి. వర్షాకాలంలో అయితే మరీ ఎక్కువగా కనిపిస్తాయి. ఎవరైనా అలంకరణ కోసం కప్పల బొమ్మలను ఇంట్లో ఉంచుకోవడానికి ప్రయత్నించరు. కానీ కప్పల ఫోటోలు గాని, బొమ్మలు గాని ఇంట్లో ఉంచడం వల్ల ధనాన్ని ఆకర్షించవచ్చని పెంగ్ షుయ్ సిద్ధాంతం తెలుపుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా కప్పల బొమ్మలను ఇంట్లో ఉంచడం వల్ల ఎక్కువగా డబ్బులు పొందవచ్చని తెలుపుతుంది. అందువల్ల ఎక్కడైనా కప్పల బొమ్మలు కనిపిస్తే ఇంట్లో ఉంచుకోవాలని పండితులు చెబుతున్నారు.
చేపలతో ఉన్న అక్వేరియంలో ఇంట్లో ఉంచుకోవడం చాలా మందికి అలవాటే. అయితే ఇందులో సాధారణ చేపలు కాకుండా గోల్డ్ కలర్ లో ఉన్న చేపలను వేయడం వల్ల వాస్తు శాస్త్రం ప్రకారం కలిసి వస్తుంది. ఈ రంగు చేపలు పాజిటివ్ ఎనర్జీని ప్రసాదిస్తాయి. అంతేకాకుండా ధనం అర్జించడానికి ఉపయోగపడతాయి. అందువల్ల అక్వేరియం ఉన్నవారు ఇప్పటికైనా గోల్డ్ కలర్ చేపలను అందులో ఉంచుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు
కొందరి ఇళ్లల్లో అలంకరణ కోసం గుర్రపు బొమ్మలను ఉంచుతారు. మరికొందరు మాత్రం జంతువుల ఫోటోలు పెట్టుకోవడానికి ఇష్టపడరు. కానీ గుర్రపు బొమ్మలు ఇంట్లో ఉంచడం వల్ల అశ్విని దేవతల అనుగ్రహం ఉంటుందని జ్యోతిషశాస్త్రంలో పేర్కొనబడింది. గుర్రపు బొమ్మలు సాధ్యం కాకపోతే పెయింటింగ్ తో ఉన్నవి కూడా ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల అన్ని కలిసి వస్తాయని వాస్తు శాస్త్రం తెలుపుతుంది.
ఇక తాబేలు గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ బొమ్మలను ఇంట్లో ఉంచడం వల్ల మనం నిలకడగా ఉంటుందని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. అయితే తాబేలు బొమ్మలు ఇంట్లో ఉంచినప్పుడు తూర్పు వైపు చూసే విధంగా ఏర్పాటు చేసుకోవాలని తెలుపుతున్నారు.