Donald Trump
Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్యోగాల పరిస్థితి, ప్రత్యేకంగా పార్ట్-టైం ఉద్యోగాలు చేసే ప్రజల వివరాలు పూర్తిగా వెల్లడించాలని బైడెన్ ప్రభుత్వాన్ని ఎన్నికల సమయంలోనే ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం 2024 ప్రెసిడెన్షియల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఎఫ్-1 వీసాదారులు పార్ట్-టైం ఉద్యోగాలు చేస్తూ పట్టుబడితే ప్రస్తుతం వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. ఇటీవల మిషిగన్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్న ఇద్దరు భారతీయ విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు అరెస్ట్ చేశారు. వీరు క్యాంపస్ బయట అనధికారికంగా పని చేస్తున్నట్లు మూడు రోజులపాటు నిఘా పెట్టి గుర్తించారు. ఈ ఘటనతో అమెరికాలోని భారతీయ విద్యార్థులు, వ్యాపారవేత్తలు, వీసాదారులందరిలోనూ గుబులు మొదలైంది.
ట్రంప్ పాలనలో మరోసారి వలసదారులపై కఠిన చర్యలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారం చేపట్టినప్పటి నుంచి వలసదారులపై కఠిన నియమాలు అమలు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అక్రమంగా పార్ట్-టైం ఉద్యోగాలు చేసేవారిపై ఐసీఈ (ICE) ప్రత్యేక దృష్టి సారించింది. బ్రవరి 15లోగా ఆ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తరహా తనిఖీలు అమెరికా వ్యాప్తంగా మరింత కఠినంగా కొనసాగే అవకాశముంది.
ఎఫ్-1 వీసా విద్యార్థులకు కలుగుతున్న ఇబ్బందులు
2024లోనే అమెరికా 84,000 భారతీయులకు ఎఫ్-1 వీసాలను మంజూరు చేసింది, ఇందులో 25,000 మంది వరకు తెలుగు విద్యార్థులే.చాలామంది విద్యార్థులు పూర్తి సమయ చదువు పేరుతో వెళ్లి, ఖర్చులు భరించేందుకు పార్ట్-టైం ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ, అమెరికా చట్టాల ప్రకారం క్యాంపస్ బయట అనధికారికంగా పని చేయడం నేరం.ఈ పరిస్థితుల్లో విద్యార్థులు భద్రత కోసం విధులకు హాజరుకావడం మానేశారు. రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకుల్లో పని చేసే భారతీయులు గత వారం రోజులుగా డుమ్మా కొడుతున్నారు.ఇది భారతీయ వ్యాపారాలు కూడా దెబ్బతినేలా చేసే అవకాశముంది.
భారతీయ వ్యాపారాలపై ప్రభావం
విద్యార్థులలో ఎక్కువ మంది “ఓపీటీ (Optional Practical Training)” ప్రోగ్రాంలో ఉంటారు. ఇది 12-36 నెలల పాటు వృత్తిపరమైన అనుభవం పొందే అవకాశాన్ని ఇస్తుంది.తర్వాత వారు హెచ్-1బీ వీసా ద్వారా ఉద్యోగం పొందేందుకు ప్రయత్నిస్తారు. ప్రస్తుతం ఓపీటీ, హెచ్-1బీ వీసా పొడిగింపుపై అనిశ్చితి నెలకొంది. ఇది భవిష్యత్తులో గ్రీన్‌కార్డ్ సాధించే అవకాశాలను తగ్గించవచ్చు.
ఇండియా ఏమి చేస్తోంది?
భారత ప్రభుత్వం ఇప్పటికే అమెరికాలో భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇండియన్ ఎంబస్సీ ఎఫ్-1 వీసాదారులపై ఇలాంటి చర్యలను సమీక్షిస్తోంది.విద్యార్థులు చట్టాన్ని ఉల్లంఘించకుండా ఉండేలా కోచింగ్ సెంటర్లు, విద్యాసంస్థలు కఠిన నిబంధనలు అమలు చేయాలని యోచిస్తున్నాయి. దీని ప్రభావంతో అమెరికాలో చదువు కోసం వెళ్లే భారతీయుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. భారతీయ విద్యార్థులకు నూతన నిబంధనలు, మరింత కఠినంగా మారే అవకాశం. పార్ట్-టైం ఉద్యోగాలకు భారీ ప్రభావం – భారతీయులు ఎక్కువగా పనిచేసే రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లకు కార్మికుల కొరత ఏర్పడే అవకాశం ఉంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Trump shocked indian students who went to america on student visa
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com