Homeజాతీయ వార్తలుDonald Trump visit to India: ఇండియాకు ట్రంప్.. ఘర్షణ వేళ ఊహించని పరిణామం

Donald Trump visit to India: ఇండియాకు ట్రంప్.. ఘర్షణ వేళ ఊహించని పరిణామం

Donald Trump visit to India: భారత్‌పై సుంకాలతో ఒకవైపు విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. భారత్‌ వాటిని లెక్క చేయకపోవడంతో ఇప్పుడు దిగివస్తున్నారు. ప్రధాని మోదీతో మాట్లాడతానని సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల సముదాయం అయిన క్వాడ్‌ సదస్సు ఈ ఏడాది నవంబర్‌లో ఢిల్లీలో జరగనుంది. ఈ సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హాజరు కావడంపై మొదట్లో ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. తాజా ఉద్రిక్తతలు, యూఎస్‌ అంబాసిడర్‌ సెర్గీ గోర్‌ల చర్చలు మొదలైనప్పటికీ సమ్మిట్‌కు ట్రంప్‌ రాకపోవచ్చని తెలుస్తోంది.

ఎదురు చూస్తున్న ట్రంప్‌..
యూఎస్‌ అంబాసిడర్‌ టు ఇండియా సెర్గీ గోర్, ట్రంప్‌ ఈ సమ్మిట్‌కు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఇది భారత్‌తో అమెరికా సంబంధాల్లో బలమైన ఆసక్తిని సూచించింది. మొదట్లో, ట్రంప్‌ జూన్‌లో మోదీ ఆహ్వానాన్ని అంగీకరించినట్లు ప్రకటించారు. ఇది ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని అరికట్టడానికి క్వాడ్‌లో అమెరికా కట్టుబాటును బలపరచడానికి సహాయపడుతుందని భావించబడింది. ఈ సమ్మిట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా, జపాన్‌ నేతతోపాటు ట్రంప్‌ చర్చలు జరిగితే, ఆర్థిక, రక్షణ, సాంకేతికతా సహకారాలు మరింత బలపడతాయని అంచనా.

ట్రంప టూర్‌పై ఒడిదుడుకుల ప్రభావం?
ఇటీవలి నెలల్లో పరిస్థితులు మారాయి. న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి మీడియా రిపోర్టుల ప్రకారం, ట్రంప్‌ ఇండియా సందర్శనను రద్దు చేసి ఉండవచ్చు. ఇందుకు ప్రధాన కారణాలు ట్రంప్‌–మోదీ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు. ట్రంప్, ఇండియా–పాకిస్తాన్‌ యుద్ధాన్ని తాను ‘పరిష్కరించాను‘ అని పదేపదే ప్రకటించడం మోదీని కోపోద్రేకంచేసింది. ఇది ట్రంప్‌ నోబెల్‌ శాంతి బహుమతికి మోదీ మద్దతు కోరుకోవడంతో మరింత తీవ్రమైంది. జూన్‌ 17న జరిగిన 35 నిమిషాల ఫోన్‌ కాల్‌లో మోదీ, అమెరికా జోక్యం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఇలా రెండు నేతల మధ్య విశ్వాసం దెబ్బతినడంతో, ట్రంప్‌ ఇప్పుడు నవంబర్‌ సమ్మిట్‌కు రాకపోవచ్చని సమాచారం.

మారిన ట్రంప్‌ వైఖరి..
తాజాగా ట్రంప్‌ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. భారత్‌ను దూరం చేసుకోవడంతో అమెరికాకే నష్టం అని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ భారత్‌తో సయోధ్యకు సై అంటున్నారు. ఇందుకు మోదీ కూడా సానుకూలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో క్వాడ్‌ సమావేశంలో ఇద్దరూ భేటీ కావడం ద్వారా చైనాకు చెక్‌ పెట్టడంతోపాటు భారత్‌–అమెరికా సంబంధాలు పునరుద్ధరించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ట్రంప్‌ భారత్‌కు వస్తారని అంచనా వేస్తునానరు. ట్రంప్‌ రాకపోతే, క్వాడ్‌ సమ్మిట్‌ పూర్తి స్థాయిలో జరగకపోవచ్చు. అమెరికా–భారత వాణిజ్య చర్చలు ఆగిపోవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version