Revanth Reddy: తెలంగాణలో (Telangana) రాజకీయ విమర్శలు పెరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో దూషణలు కొనసాగిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రి కేటీఆర్ (KTR), మల్లారెడ్డిలపై (Mallareddy), విరుచుకుపడ్డారు. అధికార పార్టీ అక్రమాలు తొక్కుతోందని విమర్శించారు. అడ్డదారులు తొక్కుతోందని పదునైన పదజాలంతో విమర్శలు చేశారు. అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఎద్దేవా చేశారు. దీంతో మంత్రి కేటీఆర్ మండి పడుతున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటైన విమర్శలు చేశారు. టీడీపీ తొత్తు, చంద్రబాబు అనుచరుడైన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి దిక్కులేక తీసుకున్నారని ఎద్దేవా చేశారు. అలాంటి వారు మాపై విమర్శలు చేయడమా అని ప్రశ్నించారు.
ఓటుకు నోటు కేసులో సూట్ కేసులతో దొరికిపోయిన నేత ఇప్పుడు మాపై ఆరోపణలు చేయడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. కాంగ్రెస్ కు భవిష్యత్ శూన్యమని తెలుసుకుని తమ ఉనికి కోసమే పార్టీపై లేనిపోని విధంగా విరుచుకుపడుతున్నారని చెప్పారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీల తీరుపై ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. రాష్ర్టంలో రేగుతున్న రాజకీయ దుమారంపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అభివృద్ధి పై పోటీ పడకుండా అనవసర విషయాలపై తమదైన శైలిలో లేవడంతో వారి మాటల్లో ఆంతర్యమేమిటో ఎవరికి అర్థం కావడం లేదు.
తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన వ్యక్తి సీఎం కేసీఆర్ ను కూడా నిందించడంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతల్లో జోష్ నింపే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మూడు చింతలపల్లి వేదికగా ఇది చోటుచేసుకుంది. దీనిపై టీఆర్ఎస్ మంత్రులు కూడా అదే తీరుగా స్పందిస్తున్నారు. అవనసర ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డిపై కక్ష తీర్చుకుంటామని చెబుతున్నారు.
మొత్తానికి మూడు చింతలపల్లి గ్రామంలో చోటుచేసుకున్న పరిణామాలతో రెండు పార్టీల్లో నేతల మధ్య పరస్పర మాటలతో తూటాలు పేల్చుతున్నారు. రాజకీయమే పరమావధిగా తమ పలుకుబడికి పని చెబుతున్నారు. ఎలాగైనా ప్రత్యర్థిని కట్టడి చేయాలని పదునైన పదజాలం వాడుతూ భయం పుట్టించాలని చూస్తున్నారు. వేదిక ఏదైనా నేతల తీరు మాత్రం మారడం లేదు. ఇక్కడ మొదలైన గొడవ ఎక్కడికి చేరుతుందో తెలియడం లేదు. రేవంత్ రెడ్డిని దెబ్బకొట్టేందుకు అధికార పార్టీ పలు పథకాలు రచిస్తోంది. ఆయన దూకుడుకు చెక్ పెట్టాలని భావిస్తోంది.