
LIC Jeevan Shanti Pension Plan: ప్రస్తుత కాలంలో డబ్బులను పొదుపు చేయడం ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. ఉద్యోగం చేస్తున్నా లేదా సొంతంగా వ్యాపారం చేస్తున్నా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని డబ్బు ఆదా చేస్తే మాత్రమే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఎల్‌ఐసీ ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తుండగా జీవిత కాలం ఆదాయం పొందాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా జీవన్ శాంతి స్కీమ్ ను అమలు చేస్తోంది.
ఈ స్కీమ్ లో ఒకసారి డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ద్వారా జీవితాంతం పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇన్వెస్ట్ చేసిన 10, 15 లేదా 20 సంవత్సరాల తర్వాత పెన్షన్ పొందేలా ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఈ స్కీమ్ లో 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరానికి 74,300 రూపాయలు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరడం ద్వారా వ్యక్తితో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది.
సమీపంలోని ఎల్‌ఐసీ ఏజెంట్ ను సంప్రదించడం లేదా ఎల్‌ఐసీ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ ను కొనుగోలు చేసి ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. సమీపంలోని ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లి కూడా ఈ స్కీమ్ ను యాక్టివేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్ లైన్ లో కూడా ఈ పాలసీని కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది.
30 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవడానికి అర్హులు. ఈ పాలసీపై రుణం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. పాలసీకి సంబంధించి ఏదైనా సమస్య ఉన్నా పాలసీని కొనసాగించడం ఇష్టం లేకపోయినా పాలసీని క్లోజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది.