https://oktelugu.com/

KTR: యూపీలో ఎస్పీకి టీఆర్ఎస్ సపోర్టు.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్స్

KTR: తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లో ఏ పార్టీకి అధికారం వస్తుందని అడగ్గా సమాజ్ వాదీ పార్టీ ముందంజలో ఉందని పేర్కొన్నారు. బీజేపీకి ఓటర్లు మొగ్గు చూపడం లేదని ఎస్పీ వైపు అందరు పరుగులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. యూపీలో ఎస్పీ దూకుడు మీదుందన్నారు. టీఆర్ఎస్ ఎస్పీకి మద్దతు తెలుపుతుందన్నారు. మరోప్రశ్నగా టీపీసీసీ రేవంత్ రెడ్డి చేసిన సవాలును స్వీకరిస్తున్నారా? అని అడిగితే ముందు […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 14, 2022 / 12:33 PM IST

    Minister KTR

    Follow us on

    KTR: తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లో ఏ పార్టీకి అధికారం వస్తుందని అడగ్గా సమాజ్ వాదీ పార్టీ ముందంజలో ఉందని పేర్కొన్నారు. బీజేపీకి ఓటర్లు మొగ్గు చూపడం లేదని ఎస్పీ వైపు అందరు పరుగులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. యూపీలో ఎస్పీ దూకుడు మీదుందన్నారు. టీఆర్ఎస్ ఎస్పీకి మద్దతు తెలుపుతుందన్నారు. మరోప్రశ్నగా టీపీసీసీ రేవంత్ రెడ్డి చేసిన సవాలును స్వీకరిస్తున్నారా? అని అడిగితే ముందు ఆయన స్టీఫెన్ సన్ ను కలిసి చర్చించాలని సమాధానమిచ్చారు. నేరస్తులతో తాను మాట్లాడనని చెప్పడం గమనార్హం.

    KTR:

    జాతీయ రాజకీయాలపై తనకుఆసక్తి లేదని రాష్ర్టంలో సుస్థిర పాలన చేయడమే లక్ష్యంగా చెప్పుకొచ్చారు. కేంద్రం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి వారి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని చెప్పిన ప్రధానమంత్రి వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు కుదేలైపోతున్నారు.

    Also Read:  మందు బాబుల‌కు అలెర్ట్‌.. రోజూ మ‌ద్యం తాగితే ఎంత డేంజ‌రో తెలుసా..?

    సికింద్రాబాద్ కంటోన్మెంట్ పై కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో రహదారులు అధ్వానంగా మారాయి. ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా ఎండగడతామని ట్వీట్ చేశారు. అభివృద్ధి పనులు అడ్డుకుంటే ఉపేక్షించేది లేదని చెప్పారు. సుచిత్ర జంక్షన్ ఫ్లైఓవర్ పనులు త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం దీనిపై తగ్గేదే లేదని చెబుతున్నారు.

    నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. రాజకీయాలు నేడు పక్కదారి పడుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నెటిజన్ల ప్రశ్నలకు మంత్రి చెప్పిన సమాధానాలతో వారు సాంత్వన చెందారు. పలు కోణాల్లో విభిన్న అంశాలు తీసుకున్నారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో జవాబులిచ్చారు.

    Also Read:  ఒమిక్రాన్‌పై బూస్టర్ డోస్ ప్రభావం చూపుతోందా.. నిపుణులు ఏమంటున్నారు..?

    Tags