PRC: ఏపీలో ఉద్యోగుల సమస్యలకు ఇంకా శాశ్వత పరిష్కారం దొరకలేదు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏపీ ఉద్యోగులకు 26 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. తాము అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారని, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాలేనందున అసలు పీఆర్సీ ఇస్తారో లేదో అనుకున్న సమయంలో సీఎం ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల అందరూ సంతోషించారు. శ్రీ కాళహస్తీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం వారైతే ఏకంగా బంగారు పుష్పాలతో జగన్ చిత్రాలకు అభిషేకం చేశారు. ఇదే విషయాన్ని ప్రధాన మీడియా కవర్ చేసింది. కానీ ఇక్కడ విషయం వేరే ఉంది.
జగన్ తీసుకున్న నిర్ణయంతో తమ జీతాలు పెరగకపోగా తగ్గే ఆస్కారం ఉందని ఉద్యోగ జేఏసీ నేతలు, అమరావతి జేఏసీ నేతలు చెబుతున్నారు. HRA విషయంలో ఏపీ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌ఆర్‌ఏ అంశంపై సీఎం కార్యాలయం చుట్టూ తిరిగిన ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం మరోసారి సీఎంవో అధికారులతో సమావేశమయ్యారు. ఫిట్‌మెంట్‌పై ఉద్యోగులు అందరూ అసంతృప్తిగా ఉన్నారని వివరించారు. గత ప్రభుత్వం కల్పించిన రాయితీల్లో కోతలు విధించడం సరికాదని సీఎంవో అధికారులకు సూచించారు ఉద్యోగ సంఘాల నేతలు.
Also Read: నెగెటివ్ టాక్ తెచ్చుకుని మరీ భారీ కలెక్షన్లు సాధించిన సినిమాలు ఇవే..!
సంక్రాంతి పండుగ అయిపోయే వరకు HRA సహా ఇతర అంశాలకు సంబంధించిన జీవోలు విడుదల చేయబోమని సీఎంవో అధికారులు తేల్చి చెప్పినట్టు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. తాజాగా వివిధ అంశాలపై ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు సీఎంఓ అధికారులతో చర్చలు జరిపారు. బండి శ్రీనివాసులు, బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. హెచ్‌ఆర్‌ఏపై అధికారుల నుంచి స్పష్టత కరువైందన్నారు.
గత ప్రభుత్వం ఇచ్చిన హెచ్‌ఆర్‌ఏ స్లాబులను సెంట్రల్ స్లాబులతో పోల్చడం వలన సచివాలయ హెచ్‌వోడీ ఉద్యోగులు 22 శాతం, జిల్లా కేంద్రాల్లోని ఉద్యోగులు 12 శాతం, మున్సిపాలిటీల్లోని ఉద్యోగులు 6.5 శాతం, మండల కేంద్రాల్లోని ఉద్యోగులు 4.5శాతం హెచ్‌ఆర్‌ఏ కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రకటించిన పీఆర్‌సీతో వేతనాలు పెరగకపోగా వచ్చేదాంట్లో కోత పడుతోందని బండి శ్రీనివాసులు, బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఇదే విషయంపై మరోసారి సీఎం జగన్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారన్నారు. దీనిపై ఎటూ తేల్చకపోతే పండుగ తర్వాత నిర్ణయం తమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
Also Read: కరోనా చికిత్సకు 8 కోట్ల ఖర్చు,, 50 ఎకరాలు అమ్మేశాడు.. అయినా..