TRS Vs BJP: బీజేపీని రెచ్చగొడుతున్న టీఆర్ఎస్.. ఆశిస్తుందేంటీ?

TRS Vs BJP:  తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారడం ఆపార్టీకి కంట్లో నలుసులా మారింది. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఏకమై బీజేపీని బలపరుస్తుండటంతో ఆపార్టీ క్రమంగా తెలంగాణలో బలపడుతోంది. వరుస ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాకిస్తూ బీజేపీ అభ్యర్థులు గెలుస్తుండటం రాష్ట్రంలో ఆపార్టీ ఎదుగుతున్న తీరుకు నిదర్శనంగా కన్పిస్తోంది. ఈనేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య కొద్దిరోజులుగా మాటలయుద్ధం నడుస్తోంది. అయితే ఇటీవల టీఆర్ఎస్ కేంద్రంలోని బీజేపీతో కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటం సర్వత్రా ఆసక్తిని […]

Written By: NARESH, Updated On : January 6, 2022 1:38 pm
Follow us on

TRS Vs BJP:  తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారడం ఆపార్టీకి కంట్లో నలుసులా మారింది. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఏకమై బీజేపీని బలపరుస్తుండటంతో ఆపార్టీ క్రమంగా తెలంగాణలో బలపడుతోంది. వరుస ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాకిస్తూ బీజేపీ అభ్యర్థులు గెలుస్తుండటం రాష్ట్రంలో ఆపార్టీ ఎదుగుతున్న తీరుకు నిదర్శనంగా కన్పిస్తోంది. ఈనేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య కొద్దిరోజులుగా మాటలయుద్ధం నడుస్తోంది. అయితే ఇటీవల టీఆర్ఎస్ కేంద్రంలోని బీజేపీతో కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.

Telangana Politics

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 371 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేపట్టారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న బండి సంజయ్ పై పోలీసులు దురుసుగా ప్రవర్తించి అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్ విధించింది. ఈక్రమంలోనే బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రంగంలోకి దిగారు. బండి సంజయ్ అరెస్టు రోజున నడ్డా ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకొని సాయంత్రం రోడ్డు షో నిర్వహించి ఉద్యోగులకు మద్దతు ప్రకటించారు.

ఆ తర్వాత జేపీ నడ్డా మీడియా సమావేశం పెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే జేపీ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ముఖ్య నేతలు మూకుమ్మడిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ జేపీ నడ్డాపై వాడిన భాష నాటుగా దారుణమైన పదజాలాన్ని ఉపయోగించారు. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అయితే ఏంగా నడ్డా.. ఇది మా అడ్డా.. ఉరికించి కొడతామంటూ హెచ్చరించడం సంచలనంగా మారింది.

ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ పదేపదే కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను ప్రస్తావించారు. బీజేపీ నేతలను విమర్శిస్తే చాలు ఐటీ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తారనే కోణంలో మాట్లాడారు. ఈ సంస్థలు బీజేపీ మిత్రపక్షాలంటూ విమర్శలు గుప్పించారు. అయితే టీఆర్ఎస్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక పెద్దమైండ్ గేమ్ ఉందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీ నేతలు పదేపదే సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈక్రమంలోనే బండి సంజయ్ పై తెలంగాణ పోలీసులు ఓవర్ యాక్షన్ తో అరెస్టు చేశారు. దీంతో వెంటనే కేంద్రంలోని బీజేపీ నేతలు రియాక్ట్ అయ్యారు. రాష్ట్రానికి ఉన్న అధికారమే కేంద్రంలోని బీజేపీ కూడా ఉంది. దీంతో కేంద్ర సర్కారు తెలంగాణ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలపై ఐటీ దాడులు చేయించే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్లు అలా చేస్తే ప్రజల్లో సానుభూతి పొంది బీజేపీని ఇరుకున పెట్టాలని టీఆర్ఎస్ యత్నిస్తోంది.

తమపై కక్షపూరితంగా కేంద్రం దాడులు చేస్తుందని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. తద్వారా రాజకీయంగా, వ్యక్తిగతంగా మైలేజ్ పొందాలని టీఆర్ఎస్ భావిస్తోంది. దీంతోనే పదేపదే ఢిల్లీ బీజేపీని టీఆర్ఎస్ నేతలు ఉచ్చులోకి లాగేందుకు పదపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని తెలుస్తోంది. మొత్తంగా బీజేపీ నుంచి ఏదో ఒక యాక్షన్ ను టీఆర్ఎస్ వెంటనే కోరుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే జైలు నుంచి బయటికి వచ్చిన బండి సంజయ్ మాత్రం టీఆర్ఎస్ గరంగరంగా ఉన్నారు. కేసీఆర్ ను జైలు పంపడం ఖాయమని శపథం చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ ఇప్పట్లో ముగిసేలా కన్పించడం లేదు.