TRS Protest: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మరో లొల్లి మొదలు కానుంది. ఇన్నాళ్లు పరస్పరం విమర్శలకు దిగుతున్న పార్టీలు ఇక ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యాయి. పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ విషయంలో చేసిన ప్రసంగంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్రంతో పెట్టుకుని టీఆర్ఎస్ ఏం సాధిస్తుందనే దానిపై విమర్శలు వస్తున్నా నేతలు మాత్రం బీజేపీని టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో ఏం జరుగుతుందనే దానిపై అందరిలో ఆందోళన నెలకొంది.

టీఆర్ఎస్ ప్రధాని దిష్టిబొమ్మలు దహనం చేయాలని ఆదేశించిన సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టడంతో బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారోననే దానిపై ఆసక్తి ఏర్పడింది. ప్రధాని తెలంగాణ విషయంలో చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలకు ఎందుకు తప్పు అనిపించిందో తెలియడం లేదు. తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు బిల్లు విషయంలో తొందరపాటుతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడంతోనే ప్రస్తుతం చిక్కులు వస్తున్నాయని ఆయన చెప్పడంలో ఆంతర్యమేమిటో టీఆర్ఎస్ నేతలు చెప్పడం లేదు.
Also Read: ఎంత పనైపాయె.. మోడీ వల్ల తలలు పట్టుకుంటున్న రాష్ట్ర బీజేపీ.. ఏకిపారేస్తున్న టీఆర్ ఎస్..
తెలంగాణను అవమానించారని చెబుతున్నారు కానీ ఆయన ఎలా అవమానించారనే దానిపై స్పష్టత లేదు. దీంతో టీఆర్ఎస్ కావాలనే బీజేపీని లక్ష్యంగా చేసుకునేందుకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఏదో సాకుతో బీజేపీని నిందించడమే ప్రధానంగా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ దూరాలోచనతో రాష్ట్రంలో ఏ పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు.

అత్త తిట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు అన్నట్లుగా ఉన్నాయి కేటీఆర్ మాటలు. తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని ప్రధాని చెబుతున్నా ఆయన మాటల్లో వివాదాలు ఏమున్నాయో కూడా టీఆర్ఎస్ నేతలకు అంతు చిక్కడం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీంతో రెండు పార్టీల వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అర్థం కావడం లేదు.
హుజురాబాద్ ఉప ఎన్నిక నుంచి టీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేసుకుంటోంది. ప్రత్యక్ష పోరాటానికే ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రంలో బీజేపీని ఎలా అణగదొక్కాలనే దానిపైనే ప్రధానంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అన్ని మార్గాల్లో బీజేపీని నిలువరించాలనే చూస్తోంది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఎంచుకున్న మార్గం సరైనదేనా అనే ఆలోచన వారికి రాకపోవడంపై అందరిలో ఆశ్చర్యం వస్తోంది.
Also Read: కాంగ్రెస్ తప్పులు సరే.. అధికారంలో ఉండి మీరు చేసిందేమిటి..? మోదీకి పలు ప్రశ్నలు
TRS MLA Jeevan Reddy Reaction On PM Modi Comments
[…] Alia Bhatt: ఆలియా భట్ కి సౌత్ లో కూడా ఫుల్ క్రేజ్ ఉంది. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పనిచేయడం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు చెప్పింది ఈ బాలీవుడ్ చిన్నది. ఆలియా భట్ మాట్లాడుతూ.. ‘నన్ను ఇంట్లో ఆలూ అని పిలుస్తారు. పుష్ప సినిమా చూసిన నా కుటుంబ సభ్యులు, ఆలూ.. అల్లుతో ఎప్పుడు సినిమా చేస్తున్నావ్?’ అని ఆటపట్టిస్తున్నారని వెల్లడించింది. మొత్తానికి ఆలియా, మొహమాటం లేకుండా బన్నీతో సినిమా చేయాలని ఉందని ఓపెన్ అయ్యింది. […]