ఈటల తీగ లాగితే కదిలేది టీఆర్ఎస్ డొంకనే?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంపై టీఆర్ఎస్ పార్టీ మౌనం వహిస్తోంది. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఈటల వ్యవహారంలో అధికార పార్టీ నేతల రహస్యాలు బయటపడతాయనే ఉద్దేశంతో ప్రస్తుతం సైలెంట్ మంత్రాన్ని ప్రయోగిస్తోంద. అసలు ఆ వివాదాస్పద భూముల్లో టీఆర్ఎస్ నేతలకే పెద్ద మొత్తంలో వాటాలుండడం గమనార్హం. దీంతో ఈ తతంగాన్ని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. ఆ భూముల్లో కేటీఆర్ కు సైతం భూములు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల […]

Written By: Srinivas, Updated On : May 8, 2021 1:13 pm
Follow us on

మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంపై టీఆర్ఎస్ పార్టీ మౌనం వహిస్తోంది. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఈటల వ్యవహారంలో అధికార పార్టీ నేతల రహస్యాలు బయటపడతాయనే ఉద్దేశంతో ప్రస్తుతం సైలెంట్ మంత్రాన్ని ప్రయోగిస్తోంద. అసలు ఆ వివాదాస్పద భూముల్లో టీఆర్ఎస్ నేతలకే పెద్ద మొత్తంలో వాటాలుండడం గమనార్హం. దీంతో ఈ తతంగాన్ని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. ఆ భూముల్లో కేటీఆర్ కు సైతం భూములు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

రేవంత్ రెడ్డి సవాలుకు..
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వివాదాస్పద భూముల వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి నిందితులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసినా ఇంతవరకు టీఆర్ఎస్ నాయకులు నోరు మెదపకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిసారి రేవంత్ రెడ్డి విమర్శలకు సమాధానం చెప్పే బాల్క సుమన్ సైతం మౌనం వహించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీఆర్ఎస్ నేతలకే పెద్ద మొత్తంలో భూములున్నాయని తెలిసి అధిష్టానం సైలెంట్ అయిందని వినికిడి.

విచారణ జరిపితే..
ఈటల రాజేందర్ భూముల వ్యవహారంపై విచారణ చేపడితే అందరి బాగోతాలు వెలుగుచూసే అవకాశాలున్నాయి. దీంతో అధికార పార్టీ నేతలు ఈటల రాజేందర్ పై చర్యలు తీసుకోకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గాలికి పోయే కంపను తగులబెట్టుకున్నట్లుగా వ్యవహారం ముదిరిపోయింది. ఈ నేపథ్యంలో ఈటల భూ కబ్జాపై ఎవరూ మాట్టాడడం లేదు. ఫలితంగా రాజేందర్ పై క్రమశిక్షణ చర్యలు ఉండకపోవచ్చనే విషయాలు స్పష్టం అవుతున్నాయి. తనదాకా వస్తే కానీ తెలియదనే సామెతను నిజం చేస్తూ అధికార పార్టీ నేతలు ప్రస్తుతం మౌనవ్రతం పాటిస్తున్నారు.

వివాదాలు కొత్తేమీ కాదు
పార్టీలకు వివాదాలు కొత్తేమీ కాదు. ఎప్పుడూ ఏదో వ్యవహారంలో వివాదాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. కొంత కాలానికి మళ్లీ యథాతధం. ప్రస్తుతం ఈటల రాజేందర్ వ్యవహారం సైతం ఇదే కోవలోకి వస్తుంది. కొద్ది రోజులు హాట్ టాపిక్ గా వాడుకుని మళ్లీ ఏదైనా కొత్త విషయం తెర మీదకు రాగానే మరుగునపడిపోతుంది. ఈటల రాజేందర్ వివాదాస్పద భూముల వ్యవహారంలో సైతంపెద్ద పెద్ద వారి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అందరూ ఏకమై మాట్లాడకుండా ఉంటున్నారనే అందరూ అనుకుంటున్నారు.