MLA Rajaiah Brother: రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ జిల్లా ఆ జిల్లా అనే తేడా లేకుండా టీఆర్ఎస్ నాయకులు రెచ్చిపోతున్నారు. తమకు నచ్చని వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. వారు మహిళలయితే లైంగికంగా వేధిస్తూ చుక్కలు చూపిస్తున్నారు. తమకు అధికారం అండగా ఉంది కదా అని రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. తమకు ఎదురు చెప్పిన వారిని లేకుండా చేసేందుకు ప్లాన్ చేస్తూ ముందుకు సాగిపోతున్నారు. వారికి పోలీసులు కూడా సహకరిస్తున్నారని ప్రతి పక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రతి పక్ష పార్టీల ఆరోపణలు ఎలా ఉన్నా కానీ వారి చేష్టలు శృతి మించుతున్నాయని ఇప్పటికే చాలా మంది బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
MLA Rajaiah Brother
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య గురించి చాలా మందికి తెలుసు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈయన తొలి వైద్య శాఖ మంత్రిగా సేవలందించాడు. కానీ తర్వాత కొద్ది రోజులకే సీఎం కేసీఆర్ ఈయన్ను పదవి నుంచి తొలగించి.. ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన కడియం శ్రీహరికి అవకాశం కల్పించారు. ఇలా ఆయన మొట్ట మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్ది రోజులకే కేసీఆర్ వద్ద బ్యాడ్ ఇంప్రెషన్ తెచ్చుకున్నారు.
Also Read: KTR Language Style: భాషకు కేసీఆర్ యే కాదు.. కేటీఆర్ కూడా గురువే..?
ఈయన మీద ఎలక్షన్స్ సమయంలో వచ్చిన ఆరోపణలకు లెక్కే లేదు. కానీ ఈయన మాత్రం వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ ఆరోపణలన్నీ అసత్యాలే అని తెలిపారు. కానీ ప్రతి పక్షాలు మాత్రం ఇప్పటికీ అటువంటి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా తాటికొండ రాజయ్య తమ్ముడు తాటికొండ సురేష్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ జంగింటి విజయలక్ష్మి అనే మహిళ జనగామ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జంగింటి విజయలక్ష్మి దంపతులకు పూర్వీకుల ఆస్తులు ఊర్లో ఉన్నాయి. దీంతో వారు ఆ భూమిలో ఇల్లు కడదామని బేస్ మెంట్ వరకు లేపి డబ్బుల్లేక అలాగే వదిలేశారు.
MLA Rajaiah
ఇప్పుడు ఆ బేస్ మెంట్ మీద ఇల్లు నిర్మాణం చేద్దామంటే స్థానికంగా సర్పంచ్ గా ఉన్న తాటికొండ సురేష్ రెండు లక్షల రూపాయలు కావాలని తమను డిమాండ్ చేస్తున్నాడని లక్ష్మి చెబుతోంది. ఈ క్రమంలోనే లక్ష్మి ఇంటి పర్మిషన్ కోసం గ్రామపంచాయతీ ఆఫీస్ కు వెళ్లింది.
ఇలా వెళ్లిన తనను సరేష్ లైంగికంగా వేధించాడంటూ లక్ష్మి ఆరోపిస్తుంది. ఎన్ని సార్లు కంప్లైంట్ చేసినా కానీ పోలీసులు పట్టించుకోవడం లేదని పోలీసులు ఈ కేసు ఫైల్ చేయకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యం అని లక్ష్మి విలపిస్తూ లెటర్ రాసి జనగామ డీసీపీకి ఫిర్యాదు చేసింది.
Also Read:CM Jagan: రాజ్యసభ సభ్యులుగా ఎవరికి అవకాశం ఇస్తారో
Recommended Videos: