Rashmika Mandanna: ఆలియా ప్లేస్ కొట్టేసిన రష్మిక.. ఇది ఎన్టీఆర్ కి షాకే !

Rashmika Mandanna: కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయడానికి ఎన్టీఆర్, తనకిష్టమైన త్రివిక్రమ్ సినిమాను కూడా వదులుకున్నాడు. కొరటాల చెప్పిన కథ, ఎన్టీఆర్ కి అంత గొప్పగా నచ్చింది. అయితే, కొరటాల కూడా ఎన్టీఆర్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయాలని కమిట్ అయ్యాడు. మరీ పాన్ ఇండియా సినిమా అంటే హీరోయిన్ కూడా ఆ స్థాయిలోనే ఉండాలి కదా. అందుకే.. ఆలియా భట్ ను ఫైనల్ చేసుకున్నారు. కానీ.. ఈ […]

Written By: Shiva, Updated On : April 22, 2022 11:46 am
Follow us on

Rashmika Mandanna: కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయడానికి ఎన్టీఆర్, తనకిష్టమైన త్రివిక్రమ్ సినిమాను కూడా వదులుకున్నాడు. కొరటాల చెప్పిన కథ, ఎన్టీఆర్ కి అంత గొప్పగా నచ్చింది. అయితే, కొరటాల కూడా ఎన్టీఆర్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయాలని కమిట్ అయ్యాడు. మరీ పాన్ ఇండియా సినిమా అంటే హీరోయిన్ కూడా ఆ స్థాయిలోనే ఉండాలి కదా. అందుకే.. ఆలియా భట్ ను ఫైనల్ చేసుకున్నారు.

Rashmika Mandanna

కానీ.. ఈ బాలీవుడ్ బ్యూటీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. గత వారం రణబీర్ కపూర్ ను పెళ్ళి చేసుకున్న ఆలియా.. తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలి అంటే.. సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని ఆమె ఈ నిర్ణయం తీసుకుందట. మొత్తానికి ఎన్టీఆర్ కి అలియా షాక్ ఇచ్చింది. అయితే, ఆలియా భట్ ప్లేస్ లో క్రేజీ హీరోయిన్ రష్మికా మందన్నాను తీసుకున్నారని తెలుస్తోంది.

Also Read: Samantha Second Marriage: రెండవ పెళ్లి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సమంత

ఇటీవల ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకుంది రష్మిక. అందుకే, ఆమెకు ఈ అవకాశం వచ్చింది. ఇక ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 300 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా గ్రాండ్ గా ఉండబోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శకుడు కొరటాల ఈ చిత్రాన్ని సరికొత్త యాక్షన్ విజువల్ ట్రీట్ గా మలచబోతున్నాడు.

అందుకోసం.. హాలీవుడ్ యాక్షన్ టెక్నీషియన్స్ ను పెట్టుకుంటున్నాడు. మరి చూడాలి.. ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో. ఇక కొరటాల ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ ఓ సోషల్ మెసేజ్ పాయింట్ ను చెప్పబోతున్నాడు. కాగా సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Rashmika Mandanna

అన్ని అనుకున్నట్లు జరిగితే సమ్మర్ నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ కానుంది. అన్నట్టు ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్స్ కూడా వేసారు. పైగా జూబ్లీహిల్స్ లోని ఎన్టీఆర్ ఇంటి పక్కనే ఓ పెద్ద సెట్ వేశారు. సినిమాలో ఎక్కువ భాగం ఈ సెట్ లోనే ఉంటుందట.

Also Read:Beast Collections: బాక్సాఫీస్ కలెక్షన్స్ లో ‘బీస్ట్’ వేస్ట్

Recommended Videos:

Tags