ఒకాయన మొన్నటి వరకు రాజకీయాల్లో తిరిగి.. ఇప్పుడు మళ్లీ సినీ గూటికి చేరిన హీరో. ఇంకో ఆయన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రి. ఇప్పుడీ ఇద్దరి భేటీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. టీఆర్‌ఎస్ కీలక నేత, రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్, మరికొందరు నేతలతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. అనంతరం ఆయనతో ఏకాంతంగా భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటల చిరు ఇంటికి ఎందుకు వెళ్లారని ఎవరికీ అంతుబట్టని అంశం. అయితే.. రాజకీయ కోణంలో ఎందుకు చూడాలన్న మాట మరికొందరి నోట వినిపిస్తోంది.
Also Read: టీడీపీ నిధుల వేట..: ముందుకు రాని క్యాడర్
తన జిల్లాలోని హుజూరాబాద్‌కు చెందిన కళాకారులు.. నిరుద్యోగ యువతకు సినీ పరిశ్రమలో ఉద్యోగ.. ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈటల కోరినట్లుగా చెబుతున్నారు. మంత్రి ఈటల మాటకు చిరు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈటలతోపాటు బండ శ్రీనివాస్.. తుమ్మేటి సమ్మిరెడ్డి తదితరులు ఉన్నారు.
తన జిల్లాలోని ఒక ప్రాంతానికి చెందిన కళాకారుల కోసం మంత్రిఈటల చిరు ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్న సైతం బలంగా వినిపిస్తోంది. ఆయనకు సొంతంగా స్టూడియో లేదు. నిర్మాణ సంస్థ మాత్రమే ఉంది. ఉపాధి అవకాశాలు కల్పించటానికి చిరు ఏమీ కీలక స్థానంలో లేరు. గతంలో ఆయన ప్రత్యేకించి ఒక ప్రాంతానికి చెందిన వారికి ఉద్యోగాలు ఇవ్వటానికి అవసరమై ప్లాట్ ఫాం లేదు.
Also Read: విశాఖ స్టీల్ ప్లాంట్ పై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం
అలాంటప్పుడు.. ఈటల భేటీ వెనుక ఆంతర్యం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. నిజానికి.. ఈటల కోరితే చిరునే నేరుగా వచ్చి కలిసే వారేమో. అలాంటప్పుడు.. తాజా భేటీ ఎందుకు? అన్నది అందుబట్టడం లేదు. ఇదిలా ఉంటే.. సీఎం మార్పుపై కొంతకాలంగా (ఆదివారం కేసీఆర్ తేల్చేశారునుకోండి) జరుగుతున్న చర్చ నేపథ్యంలో చిరును కలిశారా? అన్నది ప్రశ్నగా మారింది. ఏమైనా.. చిరు ఇంటికి మంత్రి ఈటల వెళ్లడం.. ఏకాంత భేటీ కావడం మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్