‘గ్రేటర్’ విజయం కోసం టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల విజయం కోసం టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక ఫలితం నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేయర్‌ పీఠం లక్ష్యంగా ప్రధాన పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. దుబ్బాక ఎన్నికల ఫలితంతో జీహెచ్‌ఎంసీలోనూ ఎన్నికల వేడి రాజుకుంది. ప్రత్యర్థి పార్టీల కంటే ముందే ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని అధికార పార్టీ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. Also Read: కేసీఆర్ వ్యూహం ఫలించేనా..? గ్రేటర్‌లో ఉన్న ఓట్లను ఆకర్శించడానికి ఆస్తిపన్నులో 50 […]

Written By: NARESH, Updated On : November 15, 2020 9:57 am
Follow us on

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల విజయం కోసం టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక ఫలితం నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేయర్‌ పీఠం లక్ష్యంగా ప్రధాన పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. దుబ్బాక ఎన్నికల ఫలితంతో జీహెచ్‌ఎంసీలోనూ ఎన్నికల వేడి రాజుకుంది. ప్రత్యర్థి పార్టీల కంటే ముందే ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని అధికార పార్టీ భావిస్తున్నట్టు కనిపిస్తోంది.

Also Read: కేసీఆర్ వ్యూహం ఫలించేనా..?

గ్రేటర్‌లో ఉన్న ఓట్లను ఆకర్శించడానికి ఆస్తిపన్నులో 50 శాతం రాయితీలు ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. దీంతో ప్రభుత్వంపై వందల కోట్ల భారం పడుతుందని..అయినా గ్రేటర్ ప్రజలు సంతోషంగా ఈ నిర్ణయం తీసుకున్నామని మీడియా సమావేశంలో ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న రాయితీ పెద్దగా ఉపయోగం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

గ్రేటర్‌లో మున్సిపల్ ఉద్యోగుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. జీతాల పెంపు విషయంలో మున్సిపల్ ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించడానికి ఎన్నికల తాయిలాలను ప్రకటించారని అంటున్నారు.

Also Read: ఆంధ్రజ్యోతి ఖాతాలో మరో లీగల్‌ నోటీస్‌

గ్రేటర్‌లో వరద సాయం విషయంలో ఇప్పటికి వరకూ నాలుగు లక్షలకు పై బాధితులకు దాదాపు రూ.450 కోట్ల సాయం అందించినట్లు ప్రకటించారు. ఇంకా అందని వారు ఉంటే వారి కోసం మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. వరదసాయం అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ప్రతి ప్రతిపక్షాల నాయకులు విమర్శిస్తున్నారు. గ్రేటర్లో వరద వల్ల ఎక్కువ నష్టపోయింది అద్దెకు ఉంటున్నవారు మాతమ్రే. కిరాయికి ఉన్నవారికి కాకుండా ఇంటి యజమానులకు సాయం అందించడంపై క్లారిటీ ఇవ్వలేదని విపక్షాల నాయకులు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మరి ఈ తాయిలాలతో గ్రేటర్ లో టీఆర్ఎస్ కు ఓట్లు రాలుతాయా? లేవా అన్నది చూడాలి మరి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్