
‘అన్నవారు బాగున్నారు.. పడినవారు బాగున్నారు, నడుమ వున్న వారే నలిగి చచ్చారు’ అనే విధంగా ఉంది టీఆర్ఎస్ పరిస్థితి. గ్రేటర్ ఎన్నికలకు టీఆర్ఎస్ చాలా రోజుల నుంచి కసరత్తులు మొదలు పెట్టంది. కానీ అభ్యర్థుల బాబితా రిలీజ్ చేయడం లేదు. ఎందుకంటే ఎవరు నీతిమంతులో, ఎవరు గెలుస్తారో టీఆర్ఎస్ తెలియడం లేదట.
Also Read: లెక్కలివీ: టీఆర్ఎస్ కే మేయర్ పీఠం?
గ్రేటర్ బరిలో దింపే పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం ఏకంగా ఐదు అంచెల విధానాన్ని అనుసరించినా సరైన అభ్యర్థి దొరకడం లేదట. వేర్వేరు సర్వేలు నిర్వహించి.. అభ్యర్థుల తీరు.. పార్టీకి ఉన్న గెలుపు అవకాశాల్ని మదింపు చేసినా కూడా కేటీఆర్ కు నమ్మకం కలగడం లేదట. ఎందుకంటే అభ్యర్థులపై అవినీతి అరోపణలు ఉండడం కారణమట.
సర్వే రిపోర్టుల ఆధారంగానే పది నుంచి ఇరవై సీట్లలో మార్పులు ఉంటాయని కేటీఆర్ చెప్పారట. ఇందుకు తగ్గట్లే పక్కా ప్లాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో అనుకున్న ప్లాన్ లో కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.
అలాగే అభ్యర్థుల జాబితాను విడుదల చేయకపోవటానికి కారణం.. రెబెల్స్ ముప్పు లేకుండా చేసుకోవటమేనని తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ నిన్న విడులైంది. నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలై.. శుక్రవారం సాయంత్రం నాటికి ముగుస్తోంది. అంటే.. కేవలం మూడు రోజుల మాత్రమే. ఇంత తక్కువ సమయం ఉన్నప్పుడు అభ్యర్థుల జాబితాను ప్రకటించాలి. అలా చేస్తే.. ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో.. ఈ రోజు యాభై నుంచి అరవై మంది వరకు.. గురువారం మరికొందరిని ప్రకటిస్తారని తెలుస్తోంది.
Also Read: కేసీఆర్ 10వేల సాయం.. పోటెత్తిన జనం
ఏ స్థానాల్లో అయితే కొత్తగా అభ్యర్థుల్ని దించాలని అనుకుంటున్నారో.. ఆ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన ఆలస్యమవుతుందని తెలుస్తోంది. టికెట్ రాని అభ్యర్థులు పార్టీ మారేందుకు అవకాశం లేకుండా చేయటమే టీఆర్ఎస్ వ్యూహమని రాజకీయ వర్గాల విశ్లేషణ. ఒకవేళ.. పార్టీ మారే ప్రయత్నం చేసినా.. అవతల పార్టీకి ఆలోచించుకునే అవకాశం లేకుండా చేయటమే అసలు ప్లాన్ అని తెలుస్తోంది. ఈ కారణంతోనే.. అభ్యర్థుల ఎంపిక లెక్కలు ఎప్పుడో పూర్తి అయినప్పటికీ.. వ్యూహాత్మకంగానే అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్ ప్రకటించటం లేదని తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్